Devara : “దేవర” బిజినెస్ షురూ… భారీ ధరకు అమ్ముడైన ఓవర్సీస్ రైట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తరువాత చేస్తున్న పాన్ ఇండియా మూవీ “దేవర”. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ షురూ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే “దేవర” ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం. ఇదే తారక్ కెరీర్ లోని హైయెస్ట్ డీల్ అంటున్నారు.

టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం “దేవర”. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ మూవీలో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనుంది. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఏప్రిల్ 5న ఈ మూవీని థియేటర్లోకి తీసుకురాబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే “దేవర” మూవీ అనుకున్న సమయానికి థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదని, ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం, వీఎఫ్ఎక్స్ వంటి పెండింగ్ వర్క్ కారణంగా “దేవర” వాయిదా పడబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా “దేవర” మూవీ ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్మడయ్యాయని తెలుస్తోంది. 27 కోట్ల ఫ్యాన్సీ ధరకు “దేవర” ఓవర్సీస్ హక్కులు అమ్ముడు కాగా, ఇదే ఎన్టీఆర్ సినీ కెరీర్లో జరిగిన హైయ్యెస్ట్ డీల్ అని అంటున్నారు.

నిజానికి మేకర్స్ “దేవర” ఓవర్సీస్ బిజినెస్ ను 30 కోట్ల వరకూ తీసుకెళ్లాలని భావించారు. అయితే తాజాగా జరిగిన డీల్ వాళ్ళ అంచనాలను అందుకోలేక పోయినప్పటికీ, దాదాపుగా అదే రేంజ్ లో జరగడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ నాటికి కంప్లీట్ కాబోతోంది. ప్రస్తుతం “దేవర” సినిమాకు సంబంధించి 45 రోజుల షూటింగ్ మిగిలి ఉందని సమాచారం. షూటింగ్ అనంతరం ప్రమోషన్స్ షురూ కానున్నాయి. 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కోస్టల్ బ్యాక్ డ్రాప్ మూవీ “దేవర” ఒకవేళ ఏప్రిల్ 5న పోస్ట్ పోన్ అయితే జూలై, ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే మూవీ రిలీజ్ డేట్ గురించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు