Savitri : సావిత్రి – దాసరి మధ్య నిజంగానే ఆ బంధం వుందా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దొరికిన ఆణిముత్యం మహానటి సావిత్రి.. మన మధ్య లేకపోయినా ఆమె గుర్తులు ఎప్పటికీ చెరిగిపోవని చెప్పడంలో సందేహం లేదు… తెలుగు సినిమా ప్రపంచంలో మహానటి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోతున్నారు.. సహజంగా సావిత్రి లాంటి గొప్ప నటీమణికి ఎంతోమంది అభిమానులు ఉండడం సహజం అయితే ఆమె అభిమానులుగా మారిన వారిలో లెజెండ్రీ డైరెక్టర్ దాసరి నారాయణరావు కూడా ఒకరు. సినీ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా మారిన ఈయన అప్పట్లో ఎంతో మంది హీరోయిన్లను , హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాదు సినీ ఇండస్ట్రీలో కార్మికులకు వచ్చిన సమస్యలను కూడా నెరవేర్చేవారు .

ఇక ఆయన మరణించిన తర్వాత ఇండస్ట్రీకి పెద్దదిక్కు లేకుండా పోవడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా సావిత్రి – దాసరి నారాయణరావు మధ్య ఉన్న బంధం గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. మహానటి సావిత్రి ఎప్పుడూ కూడా దాసరి నారాయణరావును సొంత కుటుంబ సభ్యుడిగానే భావించే వారట. ఈ క్రమంలోనే దాసరిని సావిత్రి తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలిచే వారని సమాచారం. ఇలా సావిత్రితో దాసరికి ఫ్యామిలీ రిలేషన్ కూడా బలపడింది. దాసరి కూడా సావిత్రిని అక్క అని మరింత ఆప్యాయంగా పిలిచేవారు. అసలు తాను సినిమాలోకి రావడానికి కూడా సావిత్రి అక్కే స్పూర్తి అని దాసరి ఎన్నోసార్లు చెప్పారు కూడా..

తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను తీరిక దొరికినప్పుడల్లా ఆమె దాసరికి మాత్రమే చెప్పేవారట.. ఇక వాటిలో ఒక సంఘటన దాసరిని బాగా కదిలించింది అదే శివరంజని సినిమా తీయడానికి ఆయనను ప్రేరేపించింది.అనుకున్నదే తడువుగా దాసరి సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే నిర్మాతలు ఎవరు ముందుకు రాలేదు. అదే సమయంలో తానే నిర్మాతగా మారారు దాసరి నారాయణరావు.. శివరంజని చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఒక ప్రయోగాత్మకంగా తెరకెక్కించడం గమనార్హం. అప్పుడే తెరమీదకి వస్తున్న వర్ధమాన తారలు సుభాషిని, జయసుధ , మోహన్ బాబు, హరిప్రసాద్ వంటి వారితో ఈ సినిమా తీసి రికార్డు క్రియేట్ చేశారు దాసరి..

- Advertisement -

సూపర్ హిట్ చిత్రంగా నిలవడమే కాదు బెంగళూరులో 52 వారాలు ఆడడం మరో విశేషం. ఈ సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన వేడుకకు ఎన్టీఆర్, ఏఎన్నార్, రాజకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసరి సావిత్రితో తనకున్న అనుబంధాన్ని వివరించడమే కాదు సావిత్రి జీవితంలో జరిగిన కొన్ని విశేషాలతోనే ఈ సినిమా తీసినట్టు చెబుతూ.. ఈ సినిమాని ఆమెకే అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ అక్కాతమ్ముడి అనుబంధం ఎప్పటికీ చెరిగిపోనిది అని చెప్పడంలో సందేహం లేదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు