Animal : “అనిమల్” మేకర్స్, నెట్ ఫ్లిక్స్ కు కోర్ట్ నోటీసులు… ఓటిటి రిలీజ్ మరింత ఆలస్యం?

Animal : పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ “అనిమల్” ఓటిటి రిలీజ్ కు లీగల్ ట్రబుల్స్ తో కష్టాలు తప్పట్లేదు. తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ విషయంలో మేకర్స్, నెట్ ఫ్లిక్స్ కు కోర్టు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ “అనిమల్” వివాదం ఏంటి? అంటే…

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్ గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ “అనిమల్”. ఈ మోస్ట్ వైలెన్స్ మూవీ థియేటర్లు ప్రేక్షకుల ఈలలతో దద్దరిల్లేలా చేసింది. 900 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి సందీప్ రెడ్డి వంగా స్టామినా ఏంటో నిరూపించింది. తండ్రి, కొడుకుల మధ్య సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ప్రేక్షకుల నుంచి మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే “అనిమల్” నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. కానీ రోజురోజుకూ ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. నిజానికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ రైట్స్ ను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ తాజాగా “అనిమల్” మూవీ ఓటిటి రిలీజ్ కు సంబంధించి కోర్టు సమన్లు జారీ చేయడంతో నెట్ ఫ్లిక్స్ నిర్ణయానికి బ్రేక్ పడింది.

- Advertisement -

అసలు వివాదం ఏమిటి? కోర్టు ఎందుకు నోటీసులు ఇచ్చింది? అనే వివరాల్లోకి వెళితే… “అనిమల్” మూవీని టి సిరీస్ ఫిలిమ్స్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఈ మూవీ సాటిలైట్ రైట్స్ విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మాథ్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగింది. కానీ సినిమాకు సహ నిర్మాతగా ఉన్న తమకు ఈ మూవీ సాటిలైట్ రైట్స్ కు సంబంధించి ఒక్క రూపాయి కూడా అందలేదని, అందులో తమకు రావాల్సిన వాటా వచ్చేంత వరకు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ ను నిలిపివేయాలని కోరుతూ సినీ వన్ పిక్చర్ స్టూడియోస్ వారు కోర్టుకెక్కారు.

ఢిల్లీ హైకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు నెట్ ఫ్లిక్స్ తో పాటు మేకర్స్ కు ఈ అంశంపై నోటీసులు జారీ చేస్తూ, జనవరి 20 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జనవరి 22న ఈ వివాదంపై మరోసారి విచారణ జరగబోతోంది. కానీ థియేటర్లలో దుమ్ము దులిపిన “అనిమల్” మూవీ ఓటిటి రిలీజ్ కు మాత్రం ఇన్ని అడ్డంకులు ఏర్పడుతుండడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలో “అనిమల్” ఓటిటి స్ట్రీమింగ్ మరింత ఆలస్యం అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు