Ranbir – Rashmika: పంజా విసిరిన యానిమల్… జవాన్, బ్రహ్మాస్త్రం రికార్డులు గల్లంతు

తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ గడప తొక్కి అక్కడ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో చేస్తున్న చిత్రం యానిమల్. దీనిలో రష్మిక మందన్నా హీరోయిన్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబరం 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో రిలీజ్ కాబోతుంది. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్… ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. టీజర్ లో యాక్షన్, అలాగే ఇటీవల విడుదలైన సాంగ్స్ లో రొమాన్స్ ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాపై రోజు రోజుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అర్జున్ రెడ్డి హిట్ తో సందీప్ రెడ్డికి తెలుగులో ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది. కానీ, యానిమల్ టీజర్, సాంగ్స్ చూసిన తర్వాత తెలుగులో పాటు సౌత్, నార్త్ స్టేట్స్ లో కూడా ఆయన క్రేజ్ పెరిగింది. అలాగే సినిమాపై హైప్ పెరుగుతుంది. ఒక ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్ లోనూ యానిమల్ రికార్డులు క్రియేట్ చేస్తుంది.

ఈ మధ్య కాలంలో ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలంటే.. జవాన్ అని చెబుతారు. అలాగే రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన బ్రహ్మాస్త్రం కూడా మంచి విజయాన్నే సాధించింది. ఈ రెండు సినిమాలు ఓవర్సీస్ లో కూడా బాగానే ఆడాయి. అయితే ఇప్పుడు ఓవర్సీస్ లో జవాన్, బ్రహ్మాస్త్రం రికార్డులను యానిమల్ బ్రేక్ చేసింది. సినిమానే రిలీజ్ కాలేదు.. అప్పుడే రికార్డులు ఎలా బ్రేక్ చేసిందని అనుకుంటున్నారా?

- Advertisement -

సినిమా రిలీజ్ కావడానికి, రికార్డుల కొట్టడానికి థియేటర్లు కావాలి కదా.. వాటి సంఖ్య పరంగా చూస్తే జవాన్, బ్రహ్మాస్త్రం కంటే.. యానిమల్ కే ఎక్కువ వచ్చాయి. జవాన్ సినిమా యూఎస్ లో 850 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. బ్రహ్మాస్త్రం కి అప్పుడు 810 స్క్రీన్స్ వచ్చాయి. కానీ, ఇప్పుడు యానిమల్ కి ఏకంగా 880 స్క్రీన్స్ కేటాయించారు. దీంతో యూఎస్ లో స్క్రీన్ల పరంగా జవాన్, బ్రహ్మాస్త్రం సినిమాలను యానిమల్ దాటేసింది. అంతే కాదు, డిసెంబర్ 1న యానిమల్ కి ఎక్కువ స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి.. ఓపెనింగ్స్ లో కూడా కొత్త రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉంది.

దీంతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వలోనే రాబోతుందని తెలిసిపోతుంది. పుష్ప కంటే యానిమాల్ మూవీ ఎక్కువ హిట్ అవుతుందని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు