Animal: ఈ దశాబ్దంలో ఇదే మొదటిసారి

సందీప్ రెడ్డి వంగ చేసింది ఒక సినిమా అయినా ఆ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకున్నాడు. అర్జున్ రెడ్డి అనే సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా టీజర్ కట్ నుంచే అంచనాలను పెంచి రిలీజ్ సమయానికి ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ ని వన్ నైట్ స్టార్ ను చేసింది. అర్జున్ రెడ్డి సినిమాకి నిర్మించడానికి సందీప్ రెడ్డి వంగ ఎంత కష్టపడ్డాడు అనేది పలు ఇంటర్వ్యూస్ చూస్తే తెలుస్తుంది. ఎట్టకేలకు ఏ ప్రొడ్యూసర్ దొరక్క సొంత బ్రదర్ ప్రణయ్ రెడ్డి వంగ ప్రొడ్యూసర్ గా అర్జున్ రెడ్డి సినిమాను నిర్మించారు.

ఈ సినిమా తెలుగు ఆడియోన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఎప్పుడో శివ సినిమా తర్వాత వచ్చిన ఇంపాక్ట్ మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులకు కలిగింది. తెలుగు సినిమా శివ కంటే ముందు శివ తర్వాత అని చెప్పుకున్నట్లు రీసెంట్ టైమ్స్ లో అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి అనే పేరు చాలా గట్టిగా వినబడింది.
ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్లో షాహిద్ కపూర్ తో అర్జున్ రెడ్డి సినిమాని కబీర్ సింగ్ గా తెరకెక్కించాడు అక్కడ కూడా ఈ సినిమా కొన్ని కాంట్రవర్సీస్ తో పాటు, వాటిని మించిన కలెక్షన్స్ను తీసుకొచ్చింది.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమా యానిమల్. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ రష్మిక మందన్న కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా రన్ టైం గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకు వస్తుంది. ఈ సినిమా రన్ టైం మూడు గంటల 12 నిమిషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గత పది ఏళ్లలో ఇంత పెద్ద ఇంత పెద్ద నిడివి ఉన్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి సినిమా కూడా దాదాపు మూడు గంటలు ఉంటుంది. ఆ సినిమా ఇంపాక్ట్ వలన ఎక్కడ బోర్ కొట్టకుండా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు అనిమల్ సినిమా కూడా అదే స్థాయిలో అనిపిస్తే సందీప్ రెడ్డివంగా మరోసారి సంచలనం సృష్టించినట్టే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు