Trisha: కెరియర్ ముగిసిపోయే తరుణంలో క్రేజీ ఆఫర్స్

త్రిష గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చాలామంది హీరోలు సరసన నటించి అద్భుతమైన పేరు సాధించింది త్రిష.  జోడి సినిమాతో పరిచయం అయిన త్రిష తెలుగులో “వర్షం” సినిమాతో అద్భుతమైన హిట్ అందుకుంది.  ఆ తర్వాత మహేష్ బాబు సరసన  చేసిన అతడు, ప్రభాస్ సరసన చేసిన పౌర్ణమి , బుజ్జిగాడు  వంటి సినిమాలు త్రిష కి మంచి పేరును తీసుకుని వచ్చాయి.

దాదాపుగా తెలుగులో ఉన్న స్టార్ హీరోస్ అందరితోనూ జత కట్టింది త్రిష.
చిరంజీవి స్టాలిన్ , నాగార్జున కింగ్ , వెంకటేష్ నమో వేంకటేశ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది.
పవన్ కళ్యాణ్ సరసన కూడా తీన్మార్ సినిమాలో కనిపించి అలరించింది త్రిష. ఒక ఫేజ్ లో త్రిష తెలుగు సినిమాను ఏలింది అని చెప్పొచ్చు.

రీసెంట్ టైంలో త్రిష కు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తన ప్రేమ వ్యవహారం పెళ్లివరకు వచ్చి ఆగిపోవడం. ఇలాంటి వ్యక్తిగత కారణాలు వలన త్రిష కొంత స్పీడ్ ను తగ్గించాల్సి వచ్చింది. ఎట్టకేలకు మళ్ళీ కొన్ని ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన కూడా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు.

- Advertisement -

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన “పొన్నియన్ సెల్వన్” సినిమాతో మంచి హిట్ అందుకుంది త్రిష. ఈ సినిమా పార్ట్ కూడా మంచి హిట్ అయింది. దాదాపు కెరియర్ డౌన్ అయిపోయింది అనుకున్న తరుణంలో ఈ సినిమా త్రిష కెరియర్ కి ఊపిరి పోసింది. రీసెంట్ గా విజయ్ సరసన నటించిన లియో సినిమాతో కూడా హిట్ అందుకుంది త్రిష. ప్రస్తుతం మణిరత్నం కమలహాసన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో లీడ్ లో రోల్ లో నటిస్తుంది త్రిష

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు