Payal Rajput: వెంకీ మామలో నటించి పెద్ద తప్పు చేశా…

టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ పేరు చెప్పగానే.. అందరికీ గుర్తు వచ్చే సినిమా RX100. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ చాలా సినిమాలు చేసింది. కానీ, ఏదీ కూడా RX100 అంత గుర్తింపు తీసుకురాలేదు. RX100లో బోల్డ్ గా కనిపించంది. అందాల ఆరబోతకు అడ్డు చెప్పలేదు. ఇదే సూత్రాన్ని ఇతర సినిమాల్లోనూ ప్రయోగించింది. అయినా ఫలితం దక్కలేదు. అప్పుడే ఈ బ్యూటీకి అర్థమై ఉంటుంది… సినిమాకు కావాల్సింది బోల్డ్ గా కనిపించడం, అందాల ఆరబోత కాదు.. మంచి కథ ఉండాలని. అందుకే తనకు RX100 లాంటి హిట్ ఇచ్చిన అజయ్ భూపతితో ఇప్పుడు మంగళవారం అనే సినిమా చేస్తుంది.

హార్రర్ థ్రిల్లర్ స్టోరీతో వస్తున్న మంగళవారం చిత్రం ఈ నవంబర్ 17న విడుదల కాబోతుంది. ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకున్న పాయల్ రాజ్ పుత్.. RX100 తర్వాత చేసిన మిస్టేక్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. RX100 విజయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, అయితే ఆ.. సంతోషం ఎక్కువ రోజులు నిలువలేకపోయిందని చెప్పింది.

RX100 తర్వాత చాలా సినిమాలు చేశానని, అవి అన్ని కూడా డిజాస్టర్లు గానే మిగిలిపోయాయని బాధపడింది. కథలను ఎంచుకోవడంలో తాను ఫెయిల్ అయినట్టు చెప్పుకొచ్చింది. అలాగే స్టోరీలను సెలెక్ట్ చేసుకోవడంలో తనకు ఎలాంటి గైడెన్స్ లేదని అందుకే అలాంటి సినిమాలు చేయాల్సి వచ్చిందని వివరించింది. అలాగే విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కాంబోలో బాబీ దర్శకత్వంలో వచ్చిన వెంకీ మామా మూవీలో కూడా తనకు నటించడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఆ సినిమాలో తాను చేసిన పాత్ర అసలు నచ్చలేదట. కానీ, వెంకటేష్, నాగా చైతన్య లాంటి స్టార్లు ఉన్నారనే ఒకే ఒక కారణంతో వెంకీ మామా సినిమా చేసిందట. ఈ సినిమా చేసినందకు ఇప్పటికీ తనకు రిగ్రేట్ ఫీల్ వస్తుందని పాయల్ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు అజయ్ భూపతి తనకు మంగళవారం సినిమాతో సూపర్ హిట్ ఇస్తాడని నమ్ముతుంది పాయల్ రాజ్ పుత్.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు