Guntur Kaaram: రివ్యూలకు వాల్యూ లేదా… మరి అక్కడ కలెక్షన్స్ ఎందుకు పడిపోయాయి?

ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే వెబ్ సైట్స్, యూట్యూబ్‌లలో ఆయా సినిమాలకు సంబంధించిన రివ్యూలు ప్రత్యేక్షమవుతాయి. కంటెంట్ బాగుండి… ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేసే సినిమాలకు మంచి రేటింగ్స్ వస్తుంటాయి. బోరింగ్ కంటెంట్‌ నిండి ఉన్న సినిమాలకు రేటింగ్స్ తక్కువగా వస్తుంటాయి. దీంతో ఆడియన్స్ కుటుంబంతో థియేటర్లకు వెళ్లాలా… వెళ్లి ఆ కంటెంట్‌కు 2000 రూపాయలు (కుటుంబం మొత్తంతో కలిసి వెళ్తే) ఖర్చు చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతారు.

కంటెంట్ బాగుంటే… 2000 మాత్రమే కాదు… 4000 రూపాయలైన పెట్టడానికి వెనకడారు. అందుకే ఇతర భాషా సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లను రాబడుతున్నాయి. అయితే ఇటీవల ఓ మాట వినిపిస్తుంది. “రివ్యూలకు వాల్యూ లేదు” ఇది ఇండస్ట్రీలో కొంత మంది ప్రొడ్యూసర్ల నుంచి వస్తున్న మాట.

గుంటూరు కారం సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాతలు నాగ వంశీ, దిల్ రాజు చాలా సందర్భంల్లో ఈ మాట అన్నారు. రిలీజ్ తర్వాత ఇదే అంటున్నారు. ఈ శుక్రవారం… గుంటూరు కారం సినిమాకు వచ్చిన కలెక్షన్ల గురించి ప్రొడ్యూసర్ ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. అప్పుడు కూడా నాగ వంశీ మళ్లీ ఇదే అన్నాడు. దీంతో రివ్యూలకు నిజంగానే వాల్యూ లేదా అనే ప్రశ్న ఇప్పుడు ఎదురవుతుంది. దీనికి ప్రస్తుతం కొన్ని సమాధానాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయింది. ప్రీమియర్స్ అర్థరాత్రి 1 గంట నుంచే స్టార్ట్ అయ్యాయి. దీంతో రివ్యూలు కాస్త ముందుగానే వచ్చాయి. ప్రీమియర్స్ వల్ల గుంటూరు కారం సినిమాకు నెగిటివ్ రివ్యూలు పడ్డాయి. ఇది… అదే రోజు రిలీజ్ అయిన హనుమాన్ సినిమాకు ప్లస్ అయింది. అలాగే… ఇప్పుడు నైజం ఏరియాలో గానీ, రెస్ట్ ఆఫ్ ఇడియాలో గానీ, అటు ఓవర్సీస్ లో గానీ, రోజువారి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఇలా కలెక్షన్లు పడిపోయాయి అంటే… రివ్యూల వల్లే కదా… అని క్రిటిక్స్ నుంచి వస్తున్న మాట.

ప్రస్తుతం ఒక ఆంధ్ర ఏరియాలోనే సినిమా బ్రేక్ ఈవెన్ వరకు వచ్చింది. (ఇప్పటికే గుంటూరు, కృష్ణ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిందని టాక్) ఇక్కడ కూడా సంక్రాంతి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందుకే ఆ ఏరియాల్లో గుంటూరు కారం మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ వరకు వచ్చిందని అంటున్నారు. అంత సంక్రాంతి ప్రభావం ఉన్నా.. ఆంధ్రలో చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అనే టాక్ కూడా ఉంది. 80 నుంచి 90 శాతం వరకు మాత్రమే రికవరీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

గుంటూరు కారం సినిమా రిలీజ్ కు ముందు… తమ సినిమాకు కలెక్షన్ల పరంగా రాజమౌళి సినిమా నెంబర్స్‌ను అందుకునే కెపాసిటీ ఉందని చెప్పుకున్నారు నిర్మాతలు. కానీ, ఇప్పడు కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చాయి అంటూ చెప్పుకోవడానికి ప్రెస్ మీట్స్ పెడుతున్నారంటే… అది రివ్యూల వల్ల కదా… అనేది నిర్మాత నాగ వంశీకే తెలియాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు