Om Bheem bush Twitter Review: ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

Om Bheem bush Twitter Review : శ్రీ విష్ణు , రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన తాజా కామెడీ హార్రర్ థ్రిల్లర్ చిత్రం ఓం భీమ్ బుష్.. ఈ సినిమాకి హుషారు, రౌడీ బాయ్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు.. టీజర్, ట్రైలర్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇక ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

ట్విట్టర్ రివ్యూ..

తాజాగా ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు.. ఇందులో కొంతమంది నెటిజన్లు ఓన్లీ లాజిక్.. ఓన్లీ ఫన్ అంటూ కామెంట్ చేయగా.. మరికొంతమంది తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ జాతిరత్నం.. జాతి రత్నాలు సినిమాని మళ్లీ గుర్తు చేశారు అంటూ కామెంట్లు చేశారు.. తెరపై చూడడం చాలా రిఫ్రెష్ గా ఉంది.. హారర్ మూమెంట్స్ అయితే క్రేజీగా ఉన్నాయి.. అద్భుతమైన కాన్సెప్ట్ తో దర్శకుడు సక్సెస్ సాధించారు అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు..

- Advertisement -

మరి ఈ సినిమా కథ విషయానికి వస్తే..

ఇందులో శ్రీ విష్ణు ( క్రిష్ ) ప్రియదర్శి( వినయ్), రాహుల్ రామకృష్ణ (మాధవ్ ) నటించారు. వీరి ముగ్గురు మంచి స్నేహితులు.. వీరిని బ్యాంగ్ బ్రోస్ అంటూ ఉంటారు. కాలేజీలో పీహెచ్డీ పేరుతో ఉంటూ నానా రచ్చ చేసే వీరు వాళ్ళు చేసే పనులు వేగలేక తానే ఎగ్జామ్స్ రాసి బయటకు పంపిస్తారు ప్రిన్సిపల్ రంజిత్ ( శ్రీకాంత్ అయ్యంగార్) ఊరికి వెళ్తూ మధ్యలో భైరవపురం దగ్గర ఆగుతారు.. ఆ ఊరిలో తాంత్రిక విద్యల పేరుతో డబ్బు సంపాదించడం చూసిన ఈ బ్యాంగ్ బ్రోస్ భైరవపురంలోకి అడుగు పెడతారు.

Om Bheem bush Twitter Review
Om Bheem bush Twitter Review:

సినిమా హైలెట్స్ ఇవే..

భైరవపురంలోకి బ్యాంగ్ బ్రోస్ ఎంట్రీ ఇచ్చాక ఏం జరిగింది? ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? అక్కడ పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? ఆ గ్రామంలో ఉన్న సంపంగి దెయ్యం ఎవరు? సంపంగి దయ్యాన్ని బ్యాంగ్ బ్రోస్ ఎందుకు పట్టుకోవడానికి వెళ్లారు? దాని నేపథ్యం ఏమిటి? ఊరిలో క్రిస్ పెట్టిన మూడు కండిషన్స్ ఏంటి ?ఇవన్నీ తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:

ఈ సినిమా క్యాప్షన్ నో లాజిక్ .. ఓన్లీ మ్యూజిక్.. దానికి తగినట్లుగానే లాజిక్ లేకుండా బాగా నవ్వించి మ్యాజిక్ చేశారు.. సినిమా ఫస్ట్ అఫ్ మొత్తం కాలేజీ సీన్లతో నవ్వుల పంచాయి.. ఇక శ్రీ విష్ణు, ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్ తో మరొకసారి అదరగొట్టేశారు. ఇకపోతే కథపరంగా కాకుండా కేవలం కామెడీ పరంగా చూస్తే సినిమా హిలేరియస్ గా ఉంటుంది.. నవ్వించడంలో మరొకసారి బ్రోచేవారెవరు రా కాంబో ని రిపీట్ చేశారని చెప్పవచ్చు..

ఓవరాల్ గా చెప్పాలంటే..

ఫైనల్ గా చెప్పాలంటే ఓం భీమ్ బుష్ సినిమా ప్రేక్షకులను బాగా నవ్వించి ఆకట్టుకుంది.. ముఖ్యంగా ఆడియన్స్ కి ఈ మూవీ బాగా నచ్చేస్తుంది.. లాజిక్ ని పక్కన పెట్టి కేవలం కామెడీని చూస్తే మాత్రం హాయిగా నవ్వుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు