Sree vishnu : ‘ఓంభీంబుష్’ బిజినెస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్.. కెరీర్ బెస్ట్..

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు, అలాగే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం “ఓం భీం బుష్”. హుషారు తో మంచి హిట్టు కొట్టిన హర్ష కొనుగంటి ఈ సినిమాను డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్, ఇంకా ట్రైలర్ లు మంచి రెస్పాన్స్ రాబట్టుకోగా రేపు అనగా మార్చి 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఒక కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కగా, ట్రైలర్ రెస్పాన్స్ ని బట్టి సినిమా మినిమం గ్యారెంటీ అని, కామెడీ చిత్రాలు కోరుకునే ఆడియన్స్ ని మెప్పించడం అయితే గ్యారెంటీ అనిపిస్తుంది. ఇక లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సామజవరగమన మూవీ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు ఇప్పుడు మరో ఎంటర్ టైనర్ మూవీ తో వచ్చేస్తున్నాడు. ఇక ఓం భీం బుష్ సినిమా కి సంబంధించి ఏరియా వారి థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ బయటికి వచ్చేసాయి.

ఏరియా వైస్ బిజినెస్ లెక్కలు..

ఓం భీం బుష్ అంటూ కామెడీ సినిమాతో రచ్చ లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా, సినిమాని మేకర్స్ సోషల్ మీడియా లో జాతిరత్నాలు రేంజ్ లో ప్రమోట్ చేసారని చెప్పాలి. దానికి తోడూ శ్రీ విష్ణు ప్రీవియస్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఓం భీమ్ బుష్ మీద పడి అన్ని చోట్లా మంచి బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్ గా ఓం భీం బుష్ సినిమా వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఏరియా వారీగా చూస్తే.. నైజాం 3 కోట్లు, సీడెడ్ 1కోటి, ఆంధ్ర 4కోట్లు జరగగా మొత్తం గా తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా, ఓవర్సీస్ సహా 1.2 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 9.30 కోట్ల బిజినెస్ చేసిందని చెప్పాలి.

- Advertisement -

శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్..

ఇక మొత్తం మీద ఓం భీం బుష్ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ 9.30 కోట్ల దాకా ఉండగా సినిమా 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక ఈ బిజినెస్ ఆల్మోస్ట్ శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్ అని సమాచారం. శ్రీ విష్ణు గత బ్లాక్ బస్టర్ చిత్రమైన సమజవరగమన కూడా 4 కోట్ల లోపే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఈ సమ్మర్ లో పక్కా ఎంటర్టైనర్ గా అనిపిస్తున్న ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఈ టార్గెట్ ను మొదటివారంలోనే అందుకోవచ్చు. పైగా ఇతర సినిమాలు కూడా పెద్దగా పోటీలేకపోవడం కలిసొచ్చే అంశం. మరి శ్రీ విష్ణు సినిమా ఈ వారం థియేటర్ల వద్ద ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు