Bucchi Babu: ఇది కదా కాన్ఫిడెన్స్ అంటే

ఉప్పెన నా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. మొదట సుకుమార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు బుచ్చిబాబు. సుకుమార్ కి కేవలం దర్శకత్వ శిష్యుడు మాత్రమే కాకుండా సుకుమార్ టీచర్ గా పని చేసే రోజుల్లో ఆయన దగ్గర స్టూడెంట్ గా కూడా ఉన్నాడు బుచ్చిబాబు. అయితే సుకుమార్ పనిచేసే ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు.

ఇకపోతే ఒక దర్శకుల దగ్గర చాలామంది సహాయ దర్శకులు పనిచేస్తూ ఉంటారు. ఎవరి టాలెంట్ను బట్టి వాళ్లు కూడా దర్శకులుగా ఎదుగుతారు. కానీ కొందరు దర్శకులు కంటే సుకుమార్ గొప్పతనం ఏంటి అని తన దగ్గర ఉన్న సహాయ దర్శకులను దర్శకులుగా మార్చడానికి సుకుమార్ తన వంతు సహాయాన్ని అందిస్తారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అలా చాలామంది సహాయ దర్శకులను దర్శకులను చేశాడు సుకుమార్.

కుమారి 21ఎఫ్ అనే సినిమాతో సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడుగా మారాడు. ఆ సినిమాకు కథను సుకుమార్ అందించాడు. రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ నటించిన సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఆ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ఒక ఫ్రెష్ ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. అలానే బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల తోపాటు చాలామంది సుకుమార్ దగ్గర పని చేసిన సహాయ దర్శకులు డైరెక్టర్ అయ్యారు.

- Advertisement -

ఇకపోతే బుచ్చిబాబు విషయానికి వస్తే మొదటి సినిమా ఉప్పెన తో మంచి హిట్ నా అందుకున్నాడు. అయితే బుచ్చిబాబు కలలు ఎప్పుడు చాలా పెద్దవిగా కంటాడు అంటూ సుకుమార్ ఇదివరకే చెప్పుకొచ్చాడు. అలానే ఉప్పెన సినిమాకి విజయ్ సేతుపతిని విలన్ గా తీసుకొచ్చి సినిమాలో నటించేలా చేశాడు. ఆ సినిమాతోనే విజయ్ సేతుపతి కి మంచి పేరు కూడా వచ్చింది.

ఇకపోతే ఇప్పుడు బుచ్చిబాబు చేస్తున్న రెండో సినిమా RC16. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక తరుణంలో సుకుమార్ అడిగినప్పుడు హీరో ఎవరు అనుకుంటున్నారు అంటే రామ్ చరణ్ అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. బుచ్చి రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అది నీకు తెలుస్తుందా అని నేను ఆశ్చర్యపోయిన సందర్భం కూడా ఉంది. ఇక హీరోయిన్ ఎవరంటే జాన్వి కపూర్ అన్నాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఏఆర్ రెహమాన్ అన్నాడు. ఏఆర్ రెహమాన్ అంటావ్ ఏంటి ఇప్పటివరకు నేనే రెహమాన్ తో పనిచేయలేదు అని చెప్పాను అన్నాడు సుకుమార్.

ఇకపోతే బుచ్చిబాబు గురించి మాట్లాడుతూ బుచ్చి ఎప్పుడు పెద్ద పెద్ద కలలు కంటాడు అంటూ చెప్పుకొచ్చాడు ఏదేమైనా ఆ కలలో కన్నా కూడా అవి వాస్తవ జీవితంలో నిజమైన అని చెప్పవచ్చు లేకపోతే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో జరగబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు