Boney Kapoor : జాన్వీ తండ్రికి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్… 68 ఏళ్ల వయసులో ఇవేం స్టంట్లయ్యా ప్రొడ్యూసరూ!!

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, దివంగత నటి శ్రీదేవి భర్త, ప్రస్తుత స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ తండ్రి బోని కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఈ ప్రొడ్యూసర్ చేయించుకున్న హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ గురించే సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఈ వయసులో ఎందుకీ వేషాలు? అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు నెటిజెన్లు.

ఇప్పటిదాకా నిర్మాతగానే కొనసాగిన బోనీ కపూర్ హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాలను కూడా నిర్మించారు. తెలుగులో 1992లో “అంతం”, 2021లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. అయితే 2023లో ఈ నిర్మాత లవ్ రంజన్ దర్శకత్వంలో రూపొందిన “తూ ఝాతి మైన్ మక్కర్” అనే సినిమాతో నటుడిగా కొత్త అవతారం ఎత్తారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ తండ్రిగా రమేష్ అరోరా అనే పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు బోనీ కపూర్. దీంతో మరిన్ని సినిమాల్లో నటించే ఆలోచనతో స్క్రీన్ పై తన లుక్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే తాజాగా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ కూడా చేయించుకున్నాడు. అది కూడా హైదరాబాద్లోనే కావడం విశేషం. ఇటీవల హైదరాబాదులోని ఒక హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ క్లినిక్ ప్రారంభోత్సవానికి హాజరైన బోని కపూర్ అక్కడే ఈ సర్జరీని కూడా చేయించుకున్నాడు. ఇదే విషయాన్ని క్లినిక్ తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో వెల్లడించింది. అందులో బోనీ కపూర్ తన జుట్టును రిస్టోర్ చేయడానికి క్లినిక్ చాలా కష్టపడిందంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.

సర్జరీ పాజిటివ్ గానే ఉందని, ట్రాన్స్ ప్లాంటెడ్ హెయిర్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలని బోని కపూర్ ఆ వీడియోలో చెప్పుకు వచ్చారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ సదరు క్లినిక్ అఫీషియల్ ఇంస్టాగ్రామ్ పేజీ నుంచి వీడియోను డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఆ వీడియోలో కనిపించిన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనంతరం బోనీ కపూర్ న్యూ లుక్ ను స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. కానీ కొంతమంది మాత్రం 68 ఏళ్ల వయసులో ఇవేం స్టంట్లయ్యా ప్రొడ్యూసరూ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక చాలామంది ఆయన ఇంస్టాగ్రామ్ పేజీని ఈ కారణంగానే ఫాలో అవుతున్నారు. ఆయన జుట్టు ఎలా పెరిగిందో చూడడానికే ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాం అంటూ కామెంట్ బాక్స్ ను నింపేస్తున్నారు. మరి లేటు వయసులో నటనపై మక్కువ కనబరుస్తున్న ఈ ప్రొడ్యూసర్ ఫ్యూచర్ నటుడిగా ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు