Mangalavaram : టీవీల్లో “మంగళవారం” విధ్వంసం… పవన్ కళ్యాణ్, విజయ్ లను కొట్టేసిందిగా..

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తాజా చిత్రం “మంగళవారం” టివిల్లో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మొదటిసారిగా టెలివిజన్ లో ప్రసారమైన ఈ మూవీ టిఆర్పి రేటింగ్స్ పరంగా విధ్వంసం సృష్టిస్తోంది. ఏకంగా పవన్ కళ్యాణ్, విజయ్ సినిమాల రేటింగ్స్ ను బీట్ చేసేసింది. బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బుల్లితెరపై ఇలాంటి రెస్పాన్స్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ “మంగళవారం” సినిమాకు వచ్చిన టిఆర్పి రేటింగ్ ఎంత అంటే?

“ఆర్ఎక్స్ 100” తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్లో రూపొందిన బోల్డ్ మూవీ “మంగళవారం”. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీతో పాయల్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఓ సెక్సువల్ డిజార్డర్ పాయింట్ ను బేస్ గా చేసుకుని అజయ్ భూపతి ఈ సినిమా కథను రాసుకున్నారు. గత ఏడాది నవంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మానసిక సమస్యతో బాధపడే యువతిగా కనిపించిన పాయల్ రాజ్ పుత్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సాధారణంగా గ్లామర్ పాత్రల్లో మెరిసే పాయల్ ఈ సినిమాలో తన యాక్టింగ్ టాలెంట్ ను బయట పెట్టింది. ఆర్ఎక్స్ 100 తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న ఈ బ్యూటీ “మంగళవారం” సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. “మంగళవారం” మూవీకి అజయ్ భూపతి టేకింగ్ తో పాటు అంజనీ లోకనాథ్ బిజిఎం, పాయల్ నటన ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

ఇక ఈ సినిమా దాదాపు 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్లలోకి వచ్చింది. కానీ 20 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ ఓటిటి, సాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు అయ్యాయి. తాజాగా మొదటిసారిగా “మంగళవారం” మూవీ స్టార్ మాలో టెలికాస్ట్ అయింది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు అదిరిపోయే టిఆర్పి రేటింగ్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అర్బన్ ఏరియాలో “మంగళవారం” మూవీకి 7.12 టిఆర్పి రేటింగ్, అర్బన్ అండ్ రూరల్ లో కలిపి 6.51 టిఆర్పి రేటింగ్ రావడం విశేషం. అయితే దళపతి విజయ్ “లియో”, పవన్ కళ్యాణ్ బ్రో సినిమాల టీఆర్పీ రేటింగ్ లను “మంగళవారం” లాంటి బోల్డ్ సినిమా బ్రేక్ చెయ్యడం విశేషం.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు