Sheesh Mahal Review: “శీష్ మహల్” మూవీ రివ్యూ

కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రను పోషించిన కొత్త మూవీ “శీష్ మహల్”. శశి దర్శకత్వంలో స్నేహల్ జంగాల నిర్మించిన ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందించారు. తక్కువ పాత్రలతో అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఈటీవీ విన్ లో ఫిబ్రవరి 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి “శీష్ మహల్” ఓటిటీ ప్రియులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ
ఓ టీవీ ఛానల్ క్రైమ్ స్టోరీస్ ప్రోగ్రాంకి ప్రొడ్యూసర్ రామకృష్ణ. మార్పుకు కారణమయ్యే ఒక మంచి సినిమాను తీయాలన్నదే ఆయన ఆశయం. అయితే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఫెయిల్ అవుతాడు. అయితే హైదరాబాదులోని ఒక ఫిలిం ఫెస్టివల్ కోసం డాక్యుమెంటరీని చేయాలనుకుంటాడు. మరోవైపు చిత్తు కాగితాలు ఏరుకునే అనాధ ఫకీర్ ఫిలిం ఫెస్టివల్ సంబరాలకు ఆకర్షితులవుతాడు. ఇక జూనియర్ ఇంటర్ చదివే లావణ్య తన ఫ్రెండ్స్ తో కలిసి ఖమ్మం నుంచి హైదరాబాద్ కు ఫిలిం ఫెస్టివల్లో సినిమాలను చూడడానికి వస్తుంది. అక్కడే ఒక యువకుడితో ప్రేమలో పడుతుంది. ఫిరోజ్ అనే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి తన పిల్లలకు ఈ ఫెస్టివల్ లో సినిమాలను చూపించాలని నిర్ణయించుకుంటాడు. మరి ఈ నలుగురి స్టోరీ ఎక్కడకు వచ్చి చేరింది? ఫిలిం ఫెస్టివల్ లో ఏం జరిగింది? రామకృష్ణ తను అనుకున్నట్టుగా డాక్యుమెంటరీ తీయగలిగాడా? ఫకీర్ ఫిలిం ఫెస్టివల్ లో సినిమా చూడగలిగాడా? లావణ్య ప్రేమ కథ ఎక్కడకు దారి తీసింది? ఫిరోజ్ తన పిల్లలను ఫిలిం ఫెస్టివల్ కు తీసుకొచ్చాడా? అన్నదే కథ.

విశ్లేషణ
డైరెక్టర్ శశి రామకృష్ణ, ఫిరోజ్, ఫకీర్, లావణ్య అనే నాలుగు పాత్రలను ప్రధానంగా తీసుకుని కథను అల్లుకున్నాడు. హైదరాబాదులో మొత్తం తెలంగాణ యాసలో నడిచే ఈ కథ సహజంగానే అనిపించినప్పటికీ, ఆసక్తికరంగా అనిపించదు. కనీసం ఒక్క స్టోరీలో కూడా ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. ఇక సినిమాలో డైరెక్టర్ కామెడీని అస్సలు టచ్ చేయలేదు. నటీనటులంతా కొత్త వాళ్లు కావడంతో ఆశించిన ఔట్పుట్ రాలేదేమో అనిపిస్తుంది. కథకు కనెక్ట్ అవ్వడానికి ప్రేక్షకుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే నిజానికి ఈ సినిమా అర్జున్ రెడ్డి సినిమాకు ముందు తీసింది. అదే విషయం ప్రతి సీన్ లోను అర్థం అయిపోతుంది. వివేక్ సాగర్ అందించిన సంగీతం పరవాలేదు అనిపించినా, ఒక్క ట్రాక్ ను కూడా డైరెక్టర్ సరిగ్గా డిజైన్ చేయకపోవడం, సరైన ముగింపు ఇవ్వకపోవడం అనేది చిరాగ్గా అనిపిస్తుంది. అసలు డైరెక్టర్ ఈ సినిమా ఎందుకు తీశాడు అన్నది ఓ పట్టాన అర్థం కాదు. కేవలం రాహుల్ రామకృష్ణ పేరు ఉన్నందుకే కొంతమంది ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ వారికి కూడా నిరాశ తప్పదు.

- Advertisement -

ప్లస్ పాయింట్స్
రాహుల్ రామకృష్ణ
సహజత్వం

మైనస్ పాయింట్స్
కొత్త నటీనటులు
ఆసక్తికరంగా లేని కథ, కథనం
సరైన ముగింపు లేకపోవడం

రేటింగ్ : 1/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు