Rashmika: నేనెప్పుడూ అలా చెప్పలేదు

వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమైన ఛలో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక. మొదటి సినిమాతోనే తనకంటూ మంచి గుర్తింపును సాధించుకొని ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన చేసిన గీత గోవిందం సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఆ సినిమాతోనే హీరోయిన్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడింది రష్మిక.

విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ అనే సినిమాలో కనిపించింది రష్మిక. అయితే ఆ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేదు. కానీ రష్మికాకు మాత్రం ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయని చెప్పొచ్చు. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన సరిలేరు నీకేవ్వరు అనే సినిమాలో నటించే అవకాశం కలిగింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఆ సినిమా తర్వాత మళ్లీ వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిన భీష్మ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత రష్మిక నటించిన సినిమా పుష్ప. సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి ప్రపంచ స్థాయికి తీసుకెళ్తే, పుష్ప అదే లెవెల్ ని కూడా మైంటైన్ చేసింది అని చెప్పొచ్చు. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది రష్మిక.

- Advertisement -

అలానే హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాలో ఒక రోల్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే పుష్ప సినిమా తర్వాత రష్మికకు పాన్ ఇండియా అవకాశాలు రావడం మొదలయ్యాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అనిమల్ సినిమాలో కూడా రష్మిక తనదైన పర్ఫామెన్స్ అందించి అద్భుతమైన పేరు సాధించుకుంది. రష్మిక కెరియర్లో అనిమల్ సినిమా ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత అద్భుతంగా చేసింది ఆ సినిమాలో నటించింది.

ఇకపోతే రష్మిక గురించి కొన్ని కథనాలు వినిపిస్తూ వచ్చాయి. అయితే వాటికి ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చింది. అలానే తనకిప్పుడు రొమాంటిక్ కామెడీ సినిమాలు చేయాలని ఉందని, అయితే గత కొంతకాలంగా కేవలం డ్రామా సినిమాలు మాత్రమే ఆమె దగ్గరికి వచ్చాయని చెప్పింది. అయితే కరెక్ట్ టైం లో మంచి స్క్రిప్స్ వస్తాయని తను నమ్ముతున్నట్టు చెప్తుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు