Rashmika Mandanna: అరుదైన గౌరవం అందుకున్న రష్మిక మందన్న..!

Rashmika Mandanna

టాలీవుడ్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరుపొందింది హీరోయిన్ రష్మిక.. ఈమె క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రష్మిక ఫిబ్రవరి-2024 ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకుంది. అండర్ 30 జాబితాలో స్థానాన్ని సంపాదించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది రష్మిక. 27 ఏళ్ల వయసులోనే తన నటనతో ప్రతిభతో ఎంతోమందిని ఆకట్టుకున్న రష్మిక ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్ గా క్రేజ్ అందుకుంది.

పుష్ప ది రైజ్, యానిమల్ సినిమాలతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న రష్మిక ఇప్పటికే భారతీయ సినిమా పైన ఒక చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో స్థానాన్ని సంపాదించుకొని తానేంటో ప్రూవ్ చేసుకుంది.. తాజాగా నలుపు రంగు స్లీవ్ లెస్ దుస్తులు ధరించి ఫోర్బ్స్ పబ్లికేషన్ లో చాలా స్టైలిష్ గా తన అందాలను వొలకబోసింది.. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. ప్రస్తుతం రష్మిక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ తో పుష్ప-2 సినిమాలో నటిస్తోంది. ఫోర్బ్స్ విషయానికి వస్తే.. సినిమాలు, క్రీడలు, మీడియా, ఫ్యాషన్ రంగాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వ్యక్తులను మాత్రమే గుర్తించి ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఈ జాబితాలో రష్మిక టాప్ ప్లేస్ లో స్థానాన్ని సంపాదించుకోవడం గమనార్హం.. ఛలో సినిమాతో తన కెరియర్ ని మొదలుపెట్టిన ఈ కన్నడ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప, యానిమల్ తదితర సినిమాలలో నటించి ఆకట్టుకుంది.

- Advertisement -

సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రష్మిక ఏమాత్రం సమయం దొరికినా సరే కచ్చితంగా అభిమానులతో సందడి చేస్తూనే ఉంటుంది. గత కొంతకాలంగా రష్మిక పెళ్లి పైన ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి.. ఈ విషయాలపై ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ రూమర్స్ మాత్రం ఆగలేదు. మొత్తానికి అయితే ఫోర్బ్స్ జాబితా లో పేరు దక్కించుకొని.. అరుదైన గౌరవాన్ని అందుకుంది రష్మిక. ఇక రష్మిక సంపాదన విషయానికి వస్తే ఒకవైపు సినిమాలు మరొకవైపు పలు యాడ్స్ చేస్తూ భారీగానే సంపాదిస్తుంది ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ .4కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు