Sreeleela: లిప్ లాక్ కి శ్రీలీల భయపడిందా.. ట్రైలర్ లో అరాచకం..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా పేరు సంపాదించిన శ్రీ లీల ఇటీవలే గుంటూరు కారం సినిమాలో నటించి మరొకసారి భారీ క్రేజ్ ను అందుకుంది.అయితే శ్రీ లీల ఎన్నో చిత్రాలను కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. వాటిలో ముఖ్యంగా యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం టిల్లు స్క్వేర్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు.. నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

2022 లో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతోంది.. మొదటి భాగంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.. అయితే రెండవ భాగంలో సిద్దుకు జోడీగా అనుపమ ను తీసుకున్నారు. వాస్తవానికి అనుపమ కంటే ముందుగా చిత్ర బృందం శ్రీలీలను తీసుకున్నారట.. పెళ్లి సందD, ధమాకా చిత్రాలతో ఒక్కసారిగా శ్రీ లీలకు భారీగా అవకాశాలు వెలువడ్డాయి. టిల్లు స్క్వేర్ సినిమాలో నటించబోతోందని, షూటింగ్ కూడా మొదలు కాబోతోందని వార్తలు వినిపించాయి.

అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ఒక్కసారిగా శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి ..అయితే అదంతా అడ్జస్ట్ చేయలేక ఈ నిర్ణయం తీసుకుందని అప్పట్లో వార్తలు అయితే వినిపించాయి.. ఆ సమయంలోనే ఎంతోమంది హీరోయిన్ల పేరు తెరమీద వినిపించాయి.. కానీ చివరికి అనుపమనే ఈ సినిమాలో నటించింది. అయితే అప్పుడు శ్రీలీల ఎందుకు నటించలేదనే విషయానికి ఇప్పుడు ట్రైలర్ చూస్తే అర్థమవుతుందని అభిమానుల సైతం తెలుపుతున్నారు.

- Advertisement -

వాలెంటైన్స్ డే సందర్భంగా టిల్లు స్క్వేర్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేశారు.. డీజే టిల్లు సినిమా కథకు కొనసాగింపుగానే ఈ చిత్రం ఉన్నట్లుగా ట్రైలర్లో చూపించారు. సిద్దు తన క్రేజీ క్యారెక్టర్ తో మరొకసారి డైలాగ్ డెలివరీతో, తన ఆటిట్యూడ్ తో మంచి కామెడీ ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. అయితే అందరిని ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే అనుపమ ఈ సినిమాలో చాలా గ్లామరస్ గా కనిపించడమే.. ముఖ్యంగా లిప్ లాక్ సన్నివేశాలు ఇంతకుముందెన్నడు లేని విధంగా.. కాస్ట్యూమ్స్ లో హాట్ లుక్ లో అందరిని ఆకట్టుకుంది.

గతంలో డీ జే టిల్లు లో ఉన్న రాధికా పాత్రను మించిపోయి అనుపమ ఇందులో నటించినట్లు కనిపిస్తోంది. ఇలాంటి లిప్ లాక్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి శ్రీ లీల ఈ చిత్రం నుంచి తప్పుకొని ఉండవచ్చు అంటూ అభిమానుల సైతం భావిస్తున్నారు. శ్రీ లీల ఇప్పటివరకు నటించిన చిత్రాలలో గ్లామర్ గానే కనిపించింది తప్ప ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయలేదు. అందుకే ఆమె ఈ సినిమా కథ విన్నప్పుడే నో చెప్పినట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు