Sundeep Kishan : “ఊరు పేరు భైరవకోన” బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన “ఊరు పేరు భైరవకోన” ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ కూడా బయటికి వచ్చాయి. VI ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను “ఏకే ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించడం జరిగింది. ఇక ఊరు పేరు భైరవకోన సినిమాకి సాలిడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు సందీప్ కిషన్ కెరీర్ లో బిజినెస్ పరంగా ఇదే హైయెస్ట్ అని టాక్. సందీప్ కిషన్ మార్కెట్ పరంగా చూసినా ఈ బిజినెస్ చాలా ఎక్కువే అని చెప్పాలి.

అయితే సినిమా మీద నమ్మకంతో బయ్యర్లు భారీ రేటు చెల్లించి కొనుక్కున్నా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా కష్టపడాల్సిన అవసరం చాలా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా ఏరియా వారీగా జరిగిన బిజినెస్ గమనిస్తే.. నైజాం : 3 కోట్లు, సీడెడ్ : 1.3 కోట్లు, ఆంధ్ర : 4.4 కోట్లు జరగగా, టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.70 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక , రెస్ట్ అఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలిపి 1.50 కోట్ల బిజినెస్ జరగగా వరల్డ్ వైడ్ గా 10.20 కోట్ల బిజినెస్ జరిగింది.

అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 11 కోట్ల వరకు షేర్ వసూలు చేయాలి. అయితే ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో వస్తున్నా కూడా పెయిడ్ ప్రీమియర్స్ కి వచ్చిన పాజిటివ్ టాక్ బలంతో ఓపెనింగ్స్ బాగా తెచ్చుకునే ఛాన్స్ ఉంది. పైగా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ వస్తున్న ఈ సినిమాకి ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే సత్తా ఉండటంతో టాక్ పాజిటివ్ గా ఉంటే ఈ టార్గెట్ ని ఈజీ గా అందుకునే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో సందీప్ కిషన్ కం బ్యాక్ అందుకుంటాడా లేదా అన్నది తెలియాలంటే టాక్ వచ్చేదాకా ఆగాలి.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు