Harika Narayan: ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్..!!

ఈమధ్య చాలా ఇండస్ట్రీలలో నటీనటులు సడన్ గా వివాహ తేదీలను ప్రకటిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.. గత నెలలో రకుల్ ప్రీతిసింగ్ వివాహం చేసుకోగా.. ఇటీవల తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసి ఆశ్చర్యపరుస్తోంది.. అలాగే కృతికర్బంధ కూడా త్వరలోనే వివాహ తేదీని ప్రకటించబోతోంది.. ఇప్పుడు తాజాగా ప్రముఖ సింగర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది..తెలుగు , తమిళంలో పలు చిత్రాలలో అలరించి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సింగర్ హారికా నారాయణ్.. ముఖ్యంగా విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమాలో తలపతి పాటతో మరింత పాపులారిటీ అందుకుంది.

సింగర్ హారికా నారాయణ్..
సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో పాడిన పాటలన్నీ కూడా భారీ సక్సెస్ ను అందుకున్నాయి.. ప్రస్తుతం టాప్ మోస్ట్ యాంకర్ గా పేరు సంపాదించింది.. ఈమె తన ప్రియుడితో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నట్లు వెల్లడిస్తూ ఇటీవలే తన నిశ్చితార్థం కూడా జరిగింది అనే విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. అలాగే తనకు కాబోయే భర్త ఫోటో కూడా షేర్ చేసింది.. హారికాకు కాబోయే భర్త పేరు పృథ్వినాథ్ వెంపటి..

ప్రేమ పెళ్ళి..
వీరిద్దరూ గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారట ఏడేళ్ల నుంచి మనది అద్భుతమైన అనుబంధమని దీనిని అధికారికంగా మరో స్థాయిలోకి తీసుకు వెళ్లడానికి సరికొత్త అనుబంధం తో మరింత కొత్తగా మొదలు పెడదామంటూ ఎంగేజ్మెంట్ ఫోటోలను కూడా షేర్ చేసింది హారిక.. ఈ ఫోటోలో చూసిన అభిమానులు సిని ప్రమికులు సైతం వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్టుగా కనిపిస్తోంది త్వరలోనే వివాహ తేదీని కూడా ప్రకటించబోతున్నారట.

- Advertisement -

హారికా నారాయణ్.. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించింది.. ఈమె ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది ప్రస్తుతం గాయనిగా ఆకట్టుకుంటుంది.. హారిక ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కుటుంబానికి చాలా దగ్గర బంధువట ..కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్న హారిక సూర్యకాంతం సినిమాలో ప్లే బ్యాక్ సింగర్ గా అడుగుపెట్టింది.. ఇందులో నిహారిక కొణిదెలా నటించింది.

ఆ తర్వాత తెలుగు, తమిళంలో ఎన్నో పాటలు పాడింది హారికా నారాయణ్.. ఇక హారికాకు కాబోయే భర్త పృధ్విరాజ్ ప్రస్తుతం విదేశాలలో ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరిద్దరూ చదువుకునేటప్పటి నుంచి ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే వివాహ తేదీని సైతం ఈ ముద్దుగుమ్మ ప్రకటిస్తుందేమో చూడాలి మరి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు