Jabardasth Anchor: జబర్దస్త్ నుంచి అందుకే బయటికి వచ్చా… యాంకర్ సౌమ్యరావు క్లారిటీ

తెలుగు బుల్లితెరపై లెజెండరీ కామెడీ షో గా పేరుపొందిన జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్.. సినిమాలలో హీరోలుగా, కమెడియన్స్, గా యాంకర్స్ గా , హీరోయిన్స్ గా కూడా మారిన వారు ఉన్నారు.. ముఖ్యంగా అనసూయ, రష్మి వంటి యాంకర్స్ ఫేట్ సైతం మార్చేసింది ఈ జబర్దస్త్ షోనే అని చెప్పవచ్చు.. వీరిద్దరూ కొన్నేళ్లపాటు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో తమ గ్లామర్ తో ఎంటర్టైన్మెంట్ చేశారు.. అయితే కొన్ని కారణాల చేత అనసూయ 2022లో జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసింది. అనసూయ మానేయడంతో కొన్ని రోజులు రష్మీ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు యాంకర్ గా చేసింది..

జబర్థస్త్ లోకి సౌమ్య రావు..
అయితే ఆ తరువాత అనంతరం కన్నడ అమ్మాయి అయిన సౌమ్యరావును తీసుకువచ్చారు.. అలా ఏడాదికి పైగా సౌమ్యారావు జబర్దస్త్ షో చేసింది.. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం ఈమె యాంకర్ గా సక్సెస్ కాలేక పోయింది.. దీంతో గడిచిన కొన్ని వారాల క్రితం నుంచి సౌమ్యారావు యాంకర్ గా తప్పుకోవడంతో ఆమె స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు వచ్చింది.. ఇటీవలే సౌమ్యరావు జబర్దస్త్ మానేయడం వెనుక గల కారణాలను కూడా వెల్లడించింది..

జబర్థస్త్ అందుకే మానేశా..
ముఖ్యంగా కొంతమందికే తన యాంకరింగ్ నచ్చలేదని.. తనకు తెలుగు కూడా సరిగ్గా రాదని.. తెలుగులో అందమైన అమ్మాయిలు ఉన్నప్పటికీ ఈ కన్నడ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు అని విమర్శలు చేశారని తెలిపింది.తనకు యాంకర్ గా కూడా పెద్దగా అనుభవం లేదని.. స్కిట్ చేస్తున్నప్పుడు జోక్స్ కూడా అర్థమయ్యేవి కావని.. తన తెలుగు కూడా చాలా దరిద్రంగా ఉందని కొంతమంది తనని ట్రోల్ చేశారని అలాగే డాన్స్ కూడా రాదని ట్రోల్ చేయడంతో డాన్స్ నేర్చుకోవడానికి డాన్స్ క్లాసులకు కూడా వెళ్లానని అలా తాను సన్నగా మారిపోయానని.. దీంతో జబర్దస్త్ డైరెక్టర్ మీరు డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్లడం వల్ల మరింత సన్నగా అయితే బాగుండదు.. కాస్త తిని ఒళ్ళు పెంచమని చెప్పారట. డాన్స్ అనేది ఏదోలాగా మేనేజ్ చేయవచ్చని.. వాటికోసం అసలు కష్టపడకండి అని చెప్పినప్పటికీ తాను మాత్రం పాత యాంకర్స్ మాదిరి ఎంటర్టైన్మెంట్ చేయాలని చాలా ప్రయత్నించానని తెలిపింది..

- Advertisement -

అదే మైనస్ గా మారింది..
పరోక్షంగా తనలో ఇన్ని లోపాలు కారణంగానే జబర్దస్త్ వీడి వచ్చానని తెలియజేసింది సౌమ్యరావు.. ముఖ్యంగా తెలుగు మాట్లాడకపోవడం డాన్స్ రాకపోవడమే తనకు మైనస్ గా మారిందని ఈమె మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే గతంలో ఉన్నంత క్రేజ్ జబర్దస్త్ కు ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పవచ్చు.. ముఖ్యంగా జడ్జిలుగా నాగబాబు, రోజా లేకపోవడంతో పైగా అనసూయ కూడా యాంకర్ గా లేకపోవడం.. వీరికి తోడు టాప్ కమెడియన్స్ సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర వంటి వారు కూడా లేకపోవడంతో జబర్దస్త్ రేటింగ్ కి మరింత మైనస్ గా మారింది..

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు