Jabardast Pavitra: బ్రేకప్ అయ్యిందంటూ ఎమోషనల్ అవుతున్న లేడీ కమెడియన్..!

పొట్టి పిల్లా..గట్టి పిల్లా.. అంటూ జబర్దస్త్లో తన అద్భుతమైన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పవిత్ర గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. అప్పుడప్పుడు పలు రకాల షోలలో సందడి చేస్తూ యువతను బాగా ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా తన ప్రియుడికి బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు విషయంలోకి వెళితే.. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి పొట్ట చేత పట్టుకొని టాలెంట్ తో హైదరాబాద్ వచ్చిన వారిని ఏరుకోరి జబర్దస్త్ వెతికి మరీ తీసుకొని.. వారికి ఒక జీవితాన్ని ప్రసాదిస్తోంది.. అలా వచ్చిన వారిలో పవిత్ర కూడా ఒకరు ..ఈ మధ్య జబర్దస్త్ లో లేడీ టీం ఒకటి సందడి చేస్తున్న విషయం తెలిసిందే.. అందులో రోహిణి టీం లీడర్ గా చేస్తుండగా.. ఆ టీంలో పవిత్ర కంటెస్టెంట్ గా చేస్తోంది.

జబర్దస్త్ కి వచ్చిన రోజు నుంచి తన టాలెంట్ తో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె షోలు, ఈవెంట్లు అంటూ ఖాళీ లేకుండా గడిపేస్తోంది. ఇక ఇటీవల ప్రేమికుల రోజున అభిమానులకు చేదువార్త చెప్పింది.. తన ప్రియుడికి బ్రేకప్ చెప్పినట్లు అధికారికంగా తెలిపింది ఈ ముద్దుగుమ్మ .. ఇకపోతే తన ప్రియుడు సంతోష్ ను పరిచయం చేస్తూ.. సంతోష్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని.. ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది.. 2022 లో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సంతోష్ ప్రపోజ్ చేస్తే.. పవిత్ర ఓకే చెప్పింది.. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.. ఇంతలోనే తామిద్దరం విడిపోయామని చెప్పి షాక్ ఇచ్చారు.

తాజాగా అందుకు సంబంధించిన ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ” మా శ్రేయోభిలాషులందరికీ తెలిజేయునది ఏమనగా..పరస్పర అవగాహన ద్వారా సంతోష్, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా మార్గాలు వేరుగా ఉన్నా..మేము పంచుకున్న క్షణాలు అలాగే ఒకరినొకరు గౌరవించుకున్న తీరుకు మేము కృతజ్ఞలుగా ఉంటాము.. మా వ్యక్తిగత ప్రయాణాలలో మా ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము.. ఈ క్లిష్ట సమయంలో మాకు మద్దతు ఇవ్వాలి.. అలాగే మాకు గోప్యత కావాలి.. మేము మా శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాము. మేము సంతోషంగా ముందుకు సాగాలి. మీ ప్రేమ అలాగే మద్దతుకు మా ధన్యవాదాలు” అంటూ రాసుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఉన్నట్టుండి విడిపోవడానికి గల కారణాలు ఏమిటి అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు