Ramam Raghavam Teaser Talk :తెరపైకి కొత్త ధనరాజ్.. ఇక్కడ కూడా సక్సెస్ అవుతాడా?

Dhanraj

టాలీవుడ్ లో టాలెంట్ ఉంటే ఏదో ఒకరోజు అందరూ తమ ప్రతిభను చాటుకునేందుకు ఇండస్ట్రీ సహకరిస్తుందని అందరికి తెలిసిందే. ఇక అలాంటి కోవలో చాలా మంది నటులు దర్శకులుగా కూడా సక్సెస్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ కమెడియన్ వేణు యెల్దండి కూడా బలగం తో మంచి అభిరుచి గల డైరెక్టర్ గా తన ప్రతిభను బయట పెట్టాడు. ఇక ఈ ఇయర్ కూడా అలాంటి కమెడియన్ దర్శకుడిగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అతనే ధనాధన్ ధనరాజ్. ధనరాజ్ గురించి టాలీవుడ్ లో తెలియని వారుండరు. చిన్న చిన్న పాత్రలతో ఇండీస్ట్రీ కి వచ్చి జబర్దస్త్ షో తో మరింత ఫేమస్ అయిన ఇతను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో పెద్ద పాత్రలు వేస్తున్నాడు.

అయితే ఇప్పుడు ధనరాజ్ దర్శకుడుగా కూడా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అది కోపోదా ఒక ఫీల్ గుడ్ డ్రామాతో. ఆ సినిమా పేరు “రామం రాఘవం”. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం “రామం రాఘవం”. ధనరాజ్ హీరోగా స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -

ప్రేమికుల రోజు సందర్భంగా ‘రామం రాఘవం’ చిత్ర టీజర్ ను హీరో రామ్ పోతినేని తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేయడం జరిగింది. టీజర్ చూస్తుంటే తండ్రి కొడుకుల నేపథ్యంలో ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ జర్నీ గా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇటు సోషల్ మీడియా లో కూడా ప్రేమికుల రోజున తండ్రి కొడుకుల మధ్య ఉన్న బాండింగ్ ను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన టీజర్ విడుదల చెయ్యడం కొత్తగా ఉందని అభిప్రాయ పడ్డారు. ఇక టీజర్ లో ఇంతకు మించి పెద్దగా రివీల్ చేయలేదు.

ఇక ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను సమకూర్చగా అరుణ్ చిల్వేరు సంగీతం అందిస్తున్నాడు, ఇందులోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు. త్వరలో ‘రామం రాఘవం’తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు