Tillu Square Trailer Talk : డబుల్ డోస్ తో వస్తుండు “టిల్లు గాడు”..

Tillu Square

టాలీవుడ్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమాల్లో టిల్లు స్క్వేర్ కూడా ఒకటి. అప్పట్లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు 2022 లో విడుదలై నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. పెట్టిన పెట్టుబడికి మూడు రేట్లు లాభాల్ని ఆర్జించింది. విమల్ కృష్ణ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఆ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించాడు. కాగా ఇప్పుడు ఆ సినిమాకు సిక్వెల్ గా “టిల్లు స్క్వేర్” వచ్చేస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేయగా, తాజాగా వాలెంటైన్స్ డే స్పెషల్ గా కాసేపటికిందటే ట్రైలర్ బ్లాస్ట్ అయింది.

ఇక డీజే టిల్లు విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా ఈ సీక్వెల్ ను మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ రెండు సినిమాలకు కథ అందించింది సిద్ధూయే కావడం విశేషం. ఇక ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, ఈ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ట్రైలర్ మొత్తం చూసాక చెప్పాలంటే టిల్లు 2 మొదటి దానితో కంపేర్ చేస్తే పెద్దగా డిఫరెన్స్ ఏమి లేదు. కానీ దానికి డబుల్ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారని మాత్రం అర్ధమైంది. పైగా రెండో పార్ట్ లో కొంచెం రొమాంటిక్ డోస్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది, దీని వల్ల ఫ్యామిలి ఆడియన్స్ ఆదరణ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది.

- Advertisement -

ఇక ఈ టిల్లు 2 లో కూడా ఫస్ట్ పార్ట్ లాగే హీరోయిన్ తన అవసరాలకోసం సిద్ధూ ని యూస్ చేసుకుంటుందేమో అని అనుకున్నా, బహుశా ఈ సినిమాలో గుడ్ ఎండింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే క్లైమాక్ వచ్చే సరికి అనుపమ హీరో దగ్గరికే వచ్చేయొచ్చు. ఇక రొమాన్స్ పరంగా, డైలాగ్స్ పరంగా, కామెడీ పరంగా ఈ సినిమాలో డబుల్ ఇస్తున్నారని అనిపిస్తున్నా, అది ఓవర్ డోస్ కూడా కాకుండా మేకర్స్ జాగ్రత్త వహించాలి. టెక్నికల్ గా కూడా ఈ సినిమాకు దాన్ని మించి ఖర్చు చేసారని తెలుస్తుంది. పైగా ఆ ఫస్ట్ పార్ట్ లో ఉన్న క్యాస్టింగే సగానికి పైగా ఈ సినిమాలో కూడా ఉన్నారు. ఇక ఈ సినిమాకు రామ్ మిరియాల మ్యూజిక్ అందించగా, బీజీఎమ్ థమన్ అందించాడు. ఇక ఫైనల్ గా మార్చ్ 29న థియేటర్ల దగ్గర టిల్లుగాని రచ్చ మొదలవుతుంది.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు