HBD Meera Jasmine: మీరాజాస్మిన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న మీరాజాస్మిన్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డును కూడా దక్కించుకుంది.. తెలుగులో బాలకృష్ణ , రవితేజ , పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు 1982 ఫిబ్రవరి 15న కేరళలోని తిరువల్లాలో జన్మించింది.. మీరా జాస్మిన్ అసలు పేరు జాస్మిన్ మేరీ జోసఫ్ ..ఈమె తల్లిదండ్రులు జోసెఫ్, అలయమ్మ.. ఇక తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం కావడంతో వారిలో నాలుగవ అమ్మాయి మీరాజాస్మిన్.. మీరాజాస్మిన్ కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు.

ఇకపోతే మీరాజాస్మిన్ సోదరీమణులు ఇద్దరూ కూడా సినిమాలలో నటించారు. ఒక సోదరుడు జార్జ్ కూడా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. 2001లో మలయాళం లో తెరకెక్కిన సూత్రధారణ అనే సినిమాతో హీరోయిన్గా కెరియర్ ను ఆరంభించిన మీరాజాస్మిన్.. తమిళంలో మాధవన్ హీరోగా తెరకెక్కిన రన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.. ఇక తెలుగులో ఈమె అమ్మాయి బాగుంది అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ్, మలయాళం లో కూడా నటించిన ఈమె కన్నడలో కూడా నటించింది పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన మౌర్య అనే సినిమాతో కన్నడలో కూడా తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే పాదమ్ ఒన్ను ఒరు విలాపం అనే సినిమాకు గానూ జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ నటిగా మూడు కేరళ స్టేట్ అవార్డులను కూడా అందుకున్న మీరాజాస్మిన్ మరెన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక చివరిగా తెలుగులో మోక్ష సినిమాలో నటించింది. మోక్ష సినిమా వరకు చీర కట్టులో పద్ధతిగా కనిపించిన మీరాజాస్మిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం హద్దులు చెరిపేసింది అని చెప్పాలి.. బోల్డ్ గా ఫోటోషూట్లు చేస్తూ తన గ్లామరస్ అందాలతో యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.. ఇలాగైనా సరే సినిమాలలో అవకాశాలు దక్కించుకోవాలని వరుస బోల్డ్ ఫోటోషూట్ లతో యువతను ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. మరి ఇకనైనా ఈమెకు సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాలు రావాలని.. మళ్లీ సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏ మేరకు మీరాజాస్మిన్ కెరియర్ సక్సెస్ అవుతుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు