HBD Meera Jasmine : వెంకీ, బాలయ్యను రిజెక్ట్ చేసిన మీరా… షాకింగ్ రీజన్

Meera Jasmine

ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది మలయాళ సోయగం మీరాజాస్మిన్. సిల్వర్ స్క్రీన్ పై తన అందం, అమాయకత్వానికి ఫిదా అయిపోయారు తెలుగు సినీ ప్రియులు. రవితేజ, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. భద్ర, మహరధి, గోరింటాకు, గుడుంబా శంకర్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్న మీరా జాస్మిన్ ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే ఈ బ్యూటీ వెంకీ, బాలయ్యతో కలిసి నటించడానికి ఎందుకు నో చెప్పింది ? అనే ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన మీరా జాస్మిన్ రీ ఎంట్రీ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అందచందాలతో నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. 40 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీని ఇచ్చే విధంగా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న టైంలోనే మీరా జాస్మిన్ కు టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అద్భుతమైన అవకాశం వచ్చిందట. బ్లాక్ బస్టర్ మూవీ “నారప్ప” సినిమాలో ముందుగా మీరా జాస్మిన్ ను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట. ఈ మేరకు ఆమెను అప్రోచ్ అవ్వగా, వెంకటేష్ తో కలిసి నటించబోయేది లేదని తేల్చి చెప్పేసిందట ఈ మలయాళ బ్యూటీ. అక్కడితో ఆగకుండా ఆయన ఇప్పుడు ముసలోడు అయిపోయాడు కదా అంటూ డైరెక్టర్ కి గట్టి షాక్ ఇచ్చిందట. అలాగే మరోవైపు బాలయ్య సినిమాలో వచ్చిన అవకాశాన్ని కూడా ఇదే రీజన్ తో రిజెక్ట్ చేసిందట.

- Advertisement -

బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన “వీర సింహారెడ్డి” మూవీలో హీరోయిన్ పాత్ర కోసం ఆమెను సంప్రదించారట. కానీ మీరాజాస్మిన్ మాత్రం మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసి పారేసిందట. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ ఇప్పటికీ ఫిలింనగర్ సర్కిల్స్ లో ఈ పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తను ప్రస్తుతం గ్లామర్ షో కు రెడీగా ఉండడంతో, కుర్ర హీరోలతో నటించడానికి మాత్రమే ఆసక్తిని కనబరుస్తోందని వార్తలు విన్పిస్తున్నాయి. ఇక ఈ బ్యూటీ ఇటీవలే “విమానం” సినిమాలో కీలక పాత్రను పోషించి, అభిమానులను సర్ప్రైజ్ చేసింది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు