DNS: శేఖర్ కమ్ముల మొదటిసారిలా.!

ఒక సినిమాకి మంచి కథ, కథనం ఎంత ముఖ్యమో అలానే ఆ సినిమాకి సంగీతం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినిమాలో సంగీతం అనేది అంతటి ప్రముఖ పాత్రను పోషిస్తుంది అని చెప్పొచ్చు. ఒక సినిమా మీద అంచనాలు పెరగడానికి, ఒక సినిమాకు ప్రేక్షకుడు రావడానికి టీజర్, ట్రైలర్ ఎంతటి కీలకపాత్రను వహిస్తాయో, ఆ సినిమా పాటలు కూడా అంతకు మించిన కీలకపాత్రను వహిస్తాయి అని చెప్పొచ్చు.

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెన్సిబుల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల అని చెప్పొచ్చు. డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు శేఖర్. ఆనంద్ సినిమాతో మంచి హిట్ అందుకొని దర్శకుడుగా తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నాడు. అయితే శేఖర్ కమ్ముల అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమాలు ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్,లీడర్ అని చెప్పొచ్చు ఈ సినిమాలన్నీ కూడా ఒక క్లాసిక్ గా అనిపిస్తాయి.

ఈ సినిమాల్లో మ్యూజిక్ కూడా చాలా పీస్ ఫుల్ గా ఉంటుంది. అయితే ఆనంద్, గోదావరి సినిమాలకు రాధాకృష్ణ సంగీతం అందించారు. ఆ సినిమా పాటలు ఇప్పుడు విన్నా కూడా ఒక ఫ్రెష్ ఫీల్ ని క్రియేట్ చేస్తాయి. ఇక హ్యాపీడేస్,లీడర్ సినిమాలకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. మిక్కీ సాంగ్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సాంగ్స్ అందించే అతి తక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్ లలో మిక్కీ ఒకరు అని చెప్పొచ్చు.

- Advertisement -

అలానే శేఖర్ కమ్ములు చేసిన ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలు సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సిహెచ్ ని లవ్ స్టోరీ సినిమాతో మ్యూజిక్ దర్శకుడుగా పరిచయం చేశాడు శేఖర్. అయితే లవ్ స్టోరీ సాంగ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మన అందరికీ తెలిసిందే. ఇకపోతే శేఖర్ ప్రస్తుతం ధనుష్ తో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

శేఖర్ కమ్ముల ధనుష్ తో చేస్తున్న సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దేవి సినిమాతో సంగీత దర్శకుడుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన దేవిశ్రీప్రసాద్, ఎన్నో సూపర్ హిట్ సినిమాలుకు సంగీతం అందించాడు. దేవి మ్యూజిక్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని కూడా చెప్పొచ్చు. ఒక టైం లో దేవి మ్యూజిక్ ఒక సంచలనం అని కూడా చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు సైతం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు

ఇకపోతే ఈ మధ్యకాలంలో దేవి హవా కొంతమేరకు తగ్గింది. అయితే రీసెంట్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలోని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేవి ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేసినా కూడా సుకుమార్ సినిమా అంటే మాత్రం అద్భుతమైన సంగీతాన్ని ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు.

ఇకపోతే శేఖర్ కమ్ముల దేవిశ్రీప్రసాద్ మొదటిసారి కలిసి ఒక సినిమాకి పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమా పాటలు ఎలా ఉండబోతున్నాయని అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంది. అయితే శేఖర్ కమ్ముల లాంటి మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్న ఒక దర్శకుడు, ఇంకో సంగీత దర్శకుడు తో ఎలాంటి పాటలు రాబట్టుకున్నాడు అని తెలియాలి అంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు