Nayanthara: విఘ్నేష్ ను నయనతార పెళ్ళి చేసుకోవడం వెనక ఇంత ప్లాన్ ఉందా..!!

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి హీరోయిన్లలో నయనతారకు మొదటి స్థానం ఉన్నది.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలు పైగా అవుతున్నా.. యంగ్ హీరోయిన్లకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తోంది. ఇప్పటికీ అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది నయనతార. ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి బాగానే సక్సెస్ అవుతోంది. ఇటీవలే షారుఖ్ నటించిన జవాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కెరియర్ పరంగా బిజీగా ఉన్న నయనతార ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పుడు ఏదో ఒక విషయం పై వైరల్ గా మారుతూనే ఉంటుంది.

విఘ్నేష్ తో పెళ్ళి..
ముఖ్యంగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది.. అయితే ఇలా పెళ్లయిన వెంటనే ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు.. ప్రస్తుతం వీరిద్దరూ తమ పిల్లలతో మాత్రం బాగా ఆనందంగా తమ సమయాన్ని గడిపేస్తున్నారు..

డివోర్స్ పై క్లారిటీ..
ఇటీవల నయనతార తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలను షేర్ చేశారు ఈ జంట.

- Advertisement -

విఘ్నేష్ తో అందుకే పెళ్లా..
ఇప్పుడు మళ్లీ తాజాగా నయనతార కు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా అవుతోంది.. అదేమిటంటే నయనతార తన రేంజ్ కంటే చాలా తక్కువ ఉన్నటువంటి డైరెక్టర్ ను పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఇదే అంటూ ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే నయనతార డైరెక్టర్ విఘ్నేష్ కంటే ముందుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా.. హీరో శింబు లను ప్రేమించింది. ఇక వారితో పెళ్లి జరగబోతుంది అనుకునే సమయంలో కొన్ని కారణాల చేత బ్రేకప్ చెప్పుకున్నారు. అలా ప్రేమ, పెళ్లి వార్తలలో నిలిచినటువంటి ఈమె డైరెక్టర్ విఘ్నేష్ ని పెళ్లి చేసుకుంది.ఇలా వివాహమైన తర్వాత కూడా ప్రభుదేవా నుంచి కోలీవుడ్ హీరో శింబు నుంచి కానీ ఈమెకు ఎలాంటి ఇబ్బంది జరిగినా డైరెక్టర్ విఘ్నేష్ పెద్దగా పట్టించుకునేవారు కాదని. కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాకుండా విఘ్నేష్ ది ఎదురు చెప్పే అంత మనస్తత్వం కూడా కాదని.. ఈ విషయాన్ని గ్రహించిన నయనతార తనని ప్రేమలో పడేసి వివాహం చేసుకుందనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఇలా పెళ్లి విషయంలో కూడా నయనతార చాలా కన్నింగ్ గా ఆలోచించిందంటూ.. అభిమానులు ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.. ఏది ఏమైనా నయనతార విషయంలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు