Raja saab: పాన్ ఇండియా మూవీ కంటే పెద్ద ప్రాజెక్ట్

ఈశ్వర్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఆ తర్వాత రాఘవేంద్ర అనే సినిమాను చేశాడు ప్రభాస్. అయితే ఈ రెండు సినిమాలు కూడా అంతంత మాత్రమే ఆడాయి. కానీ శోభన్ దర్శకత్వంలో వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ కి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలోని సాంగ్స్ ఆ కథ, కథనం అన్నీ కూడా అప్పటి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.

అయితే ప్రభాస్ ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాడు. కానీ ప్రభాస్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి అని చెప్పొచ్చు. ప్రభాస్ ఉన్న హైట్ కి ప్రభాస్ కటౌట్ కి ఆ సినిమా కథకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని చెప్పవచ్చు. ప్రభాస్ ను చూపించడంలో కూడా రాజమౌళి 200% సక్సెస్ అయ్యాడు. అక్కడితోనే ప్రభాస్ ఒక స్టార్ హీరోగా ఎదగడం మొదలుపెట్టాడు.

ఛత్రపతి సినిమా తర్వాత చేసిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి ప్రభాస్ ని చాలా దగ్గర చేసాయి. ఇకపోతే ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే బాహుబలి సినిమాని చెప్పొచ్చు. ఆ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు కేటాయించాడు ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

- Advertisement -

రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ కి మంచి కంబ్యాక్ అయింది. బాహుబలి తర్వాత ఆ స్థాయి సినిమా ఇప్పటివరకు రాలేదు. కానీ చాలా సినిమాలు తర్వాత వచ్చిన సలార్ సినిమా పర్వాలేదు అనిపించుకుని మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయిన తర్వాత ప్రభాస్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని చాలామంది అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మిస్ అయ్యారు. అలాంటి ప్రభాస్ మళ్ళీ సినిమా సినిమాల్లో కనిపిస్తే చూడాలని చాలామంది క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు.

ఇకపోతే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసింది. అయితే ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను కూడా పండగ సందర్భంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తుంది ప్రభాస్ కి బాగా సన్నిహితుడైన ప్రభాస్ శీను ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ను ఇచ్చాడు.

రాజాసాబ్ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుందని, పాన్ ఇండియా సినిమా కంటే కూడా మంచి బెటర్ కంటెంట్ అని చెప్పుకొచ్చాడు ప్రభాస్ శీను. అయితే ప్రభాస్ ని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చూసి చాలా రోజులైన తరుణంలో మళ్లీ ప్రభాస్ అలాంటి సినిమా చేస్తే చాలామందికి ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది.

ప్రభాస్ శీను రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా అని. ప్రభాస్ మునుపెన్నడూ చూడన విధంగా ఈ సినిమాలో కనిపిస్తారని, ప్రభాస్ లోని అనేక యాంగిల్స్ ను ఈ సినిమాలో చూస్తారని చెబుతూ వచ్చాడు. ఏదేమైనా ఈ సినిమా కోసం కూడా ఆడియన్స్ చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ చేస్తున్న కల్కి సినిమా తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు