Raja Saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫీస్ట్… మాస్ సాంగ్ కు డాన్స్ తో దుమ్మురేపబోతున్న డార్లింగ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు 2023 క్రిస్మస్ నుంచి మంచి టైం స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత డార్లింగ్ “సలార్” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం తన అభిమానులంతా ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న “రాజా సాబ్”పై ప్రభాస్ దృష్టి పెట్టాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఒకటి రివిల్ అయింది.

మారుతి దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ “రాజా సాబ్”. ఈ మూవీలో ప్రభాస్ సరసన తమిళ హీరోయిన్ మాళవిక మోహనన్ నటిస్తోంది. తమిళ కమెడియన్ యోగి బాబు ఈ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మొట్టమొదటిసారిగా గ్రామీణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటిదాకా యాక్షన్ హీరోగా కనిపించిన ప్రభాస్ “రాజా సాబ్”లో మాత్రం పూర్తిగా వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేయబోతున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన “రాజా సాబ్” ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం 50% షూటింగును పూర్తి చేసుకున్న ఈ మూవీ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో అదిరిపోయే మాస్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది

“రాజా సాబ్”లో ప్రభాస్ మాస్ డాన్స్ నెంబర్ తో తన అభిమానులకు సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయే ఐ ఫిస్ట్ ఇవ్వబోతున్నాడని సమాచారం. ఫిలిం నగర్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం “రాజా సాబ్”లో ప్రభాస్ దుమ్మురేపే డాన్స్ మూమెంట్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో నాలుగు పాటలు ఉండగా, ఒక్కో హీరోయిన్ తో ఒక్కో పాట ఉంటుందని, అదనంగా ఐటెం సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్ ఈసారి అదిరిపోయే స్టెప్పులతో తన అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం అంటున్నారు. ఈ అప్డేట్ ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. మరోవైపు “రాజా సాబ్” సినిమా డిసెంబర్ లో రిలీజ్ కాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ రిలీజ్ విషయంలో “సలార్” సెంటిమెంట్ ను మేకర్స్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. చాలాకాలం తర్వాత క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమాతో ప్రభాస్ హిట్ అందుకోవడమే అందుకు కారణం. అందుకే “రాజా సాబ్” మూవీని కూడా 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు