Sai Dharam Tej : సాయి తేజ్ డిమాండ్ వల్ల నెక్స్ట్ ప్రాజెక్ట్ కు బ్రేక్… రెమ్యూనరేషన్ కారణమా?

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు బ్రేకులు పడ్డాయా? అంటే ఫిలిం వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అవును అనే సమాధానమే వినిపిస్తోంది. సాయి తేజ్, సంపత్ నంది కాంబినేషన్లో రూపొందుతున్న తాజా ప్రాజెక్టు ఆగిపోయినట్టు సమాచారం.

యాక్సిడెంట్ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాల జోరు తగ్గించిన విషయం తెలిసిందే. గత ఏడాది వేసవిలో “విరుపాక్ష” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో ఇకపై వరుసగా సినిమాలు చేస్తాడని మెగా అభిమానులు భావించారు. అందరూ అనుకున్నట్టుగానే “విరూపాక్ష” ఇచ్చిన జోష్ తో తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి “బ్రో”తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమాలో తేజ్ నటనపై దారుణమైన విమర్శలు వచ్చాయి. అలాగే మూవీ కూడా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ప్రస్తుతం సాయి తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించి పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. కానీ ఇప్పటిదాకా ఒక్క ప్రాజెక్ట్ కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ గ్యాప్ లో తన బరువు తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు తేజ్. అయితే ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సంపత్ నందితో కలిసి తేజ్ “గాంజా శంకర్” అనే సినిమాను చేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కకముందే క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “గాంజా శంకర్” ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయని సమాచారం. సాయి ధరం తేజ్ భారీ పారితోషికం డిమాండ్ చేయడమే దీనికి కారణం అని అంటున్నారు. ఈ సినిమాలో నటించడానికి తేజ్ 15 కోట్ల రూపాయల పారితోషకం అడుగుతున్నారట. అయితే నిజానికి తేజ్ మార్కెట్ ఇప్పుడు పారితోషికం డిమాండ్ చేసే రేంజ్ లో లేదు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తెలుగు సినిమాల నాన్ ధియేట్రికల్ మార్కెట్ కూడా పడిపోయింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సితార ఎంటర్టైన్మెంట్స్ “గాంజా శంకర్” ప్రాజెక్టును ఆపేయాలని నిర్ణయించుకుందని సమాచారం. ఇక తేజ్ వేరే ప్రాజెక్టుల కోసం ఇతర దర్శకులతో చర్చలు జరుపుతున్నాడట. “విరూపాక్ష” మూవీ విడుదలై ఏడాది దాటిన ఈ మెగా హీరో చేతిలో ఒక్క సాలిడ్ ప్రాజెక్ట్ కూడా లేకపోవడం గమనార్హం. మరి ఈ ఏడాది ద్వితీయార్థంలోనైనా సాయి ధరం తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందేమో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు