Shekhar Kammula: శేఖర్ కమ్ముల కైండ్ అఫ్ మాఫియా

Shekhar Kammula

శేఖర్ కమ్ముల క్లాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్. డాలర్ డ్రీమ్స్ సినిమాతో దర్శకుడుగా కెరియర్ మొదలు పెట్టాడు శేఖర్. కానీ శేఖర్ కి మంచి హిట్ ఇచ్చిన సినిమా మాత్రం ఆనంద్ అని చెప్పొచ్చు. ఆనంద్ సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా తో పాటుగా రిలీజ్ అయింది. అయితే ఆ తరణంలో ఆనంద్ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ఆ సినిమాకు ఉన్న క్యాప్షన్ కూడా మంచి ఫీల్ క్రియేట్ చేసింది. ఆనంద్ ఓ మంచి కాఫీలాంటి సినిమా అనే లైన్ చాలామందికి ఎక్కడో టచ్ అయింది.

ఆ రోజుల్లోనే ఆనంద్ మంచి హిట్ అయి దర్శకుడుగా శేఖర్ కమ్ములను నిలబెట్టింది. ఇప్పటికీ శేఖర్ కమ్ముల బెస్ట్ వర్క్ అంటే హ్యాపీడేస్ అని చెబుతారు. హ్యాపీడేస్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాలేజ్ లైఫ్ ని కాలేజీలో ఉండే అల్లరితనాన్ని, ఫ్రెండ్షిప్ వ్యాల్యూ ని అద్భుతంగా చూపించిన సినిమా. హ్యాపీ డేస్ తర్వాత శేఖర్ కమ్ముల చేసిన సినిమాలు అత్యద్భుతమైన హిట్ కాకపోయినా కూడా పర్వాలేదు అనిపించుకున్నాయి.

ఇప్పటికీ శేఖర్ కమ్ముల సినిమా అంటే ఒక కైండ్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే చివరిగా లవ్ స్టోరీ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ తో పాటు నాగార్జున కూడా నటిస్తున్నట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే ధనుష్ చేస్తున్న ఈ సినిమాకి “ధారావి” అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాగార్జున ఒక డాన్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

ఈ సినిమా ఒక మాఫియా బ్యాక్డ్రాప్ లో జరగనున్నట్టు తెలుస్తుంది. శేఖర్ కమ్ముల ఈ జోనర్ లో సినిమాను టచ్ చేయటం ఫస్ట్ టైం. ఏదేమైనా ఈ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల నుంచి ఈ కైండ్ ఆఫ్ సినిమా రావటం ఇదే మొదటిసారి. పొలిటికల్ మూవీగా లీడర్ ను తెరకెక్కించి మంచి రెస్పాన్స్ అందుకున్నాడు శేఖర్. అలానే మాఫియా సినిమా శేఖర్ కమ్ముల చేస్తే ఎలా ఉండబోతుందో అని చాలామందికి ఒక క్యూరియాసిటీ ఏర్పడుతుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు