Relationship Tips : రిలేషన్ షిప్ కు బంధువులు హానికరం… వాళ్లు చెప్పే ఈ 5 సలహాలు అస్సలు వినకండి

Relationship Tips : సంబంధం ఏదైనా ప్రేమతో పాటు పరస్పర అవగాహన, గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య బంధం ఏ అంశాలతోనే బలపడుతుంది. వీటిలో ఒక్క విషయంలో తేడా వచ్చినా కూడా ఆ సంబంధం తెగదెంపులు చేసుకునేదాకా వెళ్తుంది. భార్యాభర్తల మధ్య సంబంధం వ్యక్తిగతమైనది. కాబట్టి ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి ప్రమేయం లేకపోవడమే మంచిది. వాళ్ళ మాటలు భార్యాభర్తల మధ్య గొడవను మరింత పెద్దదిగా చేస్తాయి. చాలా సార్లు గొడవలు వచ్చినపుడు వైఫ్ అండ్ హస్బెండ్ బంధువుల సలహాలను తీసుకుంటూ ఉంటారు. కానీ ఇదే వాళ్ళు చేసే అతి పెద్ద తప్పు. ఈ బంధువుల సలహాలు మరింత హానికరం. భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా ఉంటుంది. కానీ మూడో వ్యక్తి జోక్యం పెరగడం ప్రారంభమైతే ఆ బంధం బీటలు వారుతుంది. అందుకే బంధువులు ఇచ్చే ఈ 5 సలహాలు, సూచనలకు దూరంగా ఉండండి.

పిల్లలు పుడితే అంతా సర్దుకుంటుంది

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ప్రారంభమైనప్పుడు బంధువులు పిల్లలను కనమని సలహా ఇస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులుగా మారే బాధ్యత వస్తే అంతా బాగుంటుందని వారు భావిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు శిశువు బాధ్యత తీసుకోవడానికి మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా లేకుంటే మీ బంధం మెరుగుపడడానికి బదులుగా మరింత దిగజారుతుంది.

అస్సలు తగ్గొద్దు

భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు బంధువులు లొంగకూడదని సలహా ఇవ్వడం తరచుగా జరుగుతుంది. అయితే అలాంటి సలహాలను అనుసరించే బదులు మాట్లాడటం నిజంగా మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందా లేదా సంబంధాన్ని కాపాడుకోవడానికి అహంకారాన్ని పక్కన పెట్టడం అవసరమా అని మీరు కూల్ మైండ్‌తో ఆలోచించాలి.

- Advertisement -

కొన్ని రోజులు మాట్లాడకు అప్పుడు తెలుస్తుంది

ఏదైనా సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, దానిని బలోపేతం చేయడానికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఎందుకంటే మాట్లాడటం ద్వారా మాత్రమే మీరు మీ భాగస్వామి అభిప్రాయాన్ని బాగా అర్థం చేసుకోగలరు. ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలను మాట్లాడినప్పుడే తొలగించగలరు. అందుకే ‘కొద్దిరోజులు మాట్లాడకుంటే తనకి తెలిసిపోతుంది’ అని బంధువులు, స్నేహితులు చెప్పే సలహాలను పాటించకండి.

విడివిడిగా జీవించడం ప్రారంభించండి

కొన్ని సమయాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు లేదా వాదనలు తారా స్థాయికి వెళ్తాయి. కానీ దీని అర్థం కుటుంబం నుండి విడిపోవాలి లేదా మీరు విడిగా జీవించడం ప్రారంభిస్తే అంతా బాగుంటుందని ఎవరైనా చెబితే ఈ సలహాను పట్టించుకోకూడదు. బదులుగా పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి.

అమ్మాయిలు మాత్రమే ఇంటి పనులు చేయాలి

ఈ రోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ పని చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఇంటి పనులు కూడా ఇద్దరి బాధ్యతగా ఉండాలి. చాలా సార్లు వివాదాలు ముదిరినపుడు అమ్మాయిలు సర్దుకుపోవాలని, ఇంటి పనులు కూడా వాళ్ళ బాధ్యతే అని బంధువులు చెప్పడం తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. అటువంటి సలహాను అనుసరించడం ద్వారా మీరు ఒత్తిడికి గురవుతారు. ఇది మీ సంబంధానికి మంచిది కాదు. అటువంటి పరిస్థితి ఎదురైతే మీ సమస్యలను మీ భాగస్వామితో బహిరంగంగా పంచుకోండి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు