Family Star Censor Report : “ఫ్యామిలీ స్టార్” బూతులు కట్… సినిమాలో ఇలాంటి పదాలు ఉన్నాయా?

Family Star Censor Report : ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఫ్యామిలీ స్టార్ సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. టైటిల్ కు తగ్గట్టుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి క్లీన్ మూవీ క్లీన్ గా ఉంటుందేమో అనుకుంటున్నవారికి షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో బూతులు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. సెన్సార్ బృందం ఈ సినిమాలో కొన్ని డైలాగులను మ్యూట్ చేయమని సూచించిందట. మరి ఇంతకీ ఫ్యామిలీ స్టార్స్ సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది? అనే విషయంలోకి వెళ్తే…

ఫ్యామిలీ స్టార్ లో బూతులా…

ఫ్యామిలీ స్టార్ మూవికి సెన్సార్ బోర్డు ( Family Star Censor Report ) కొన్ని డైలాగులకు సంబంధించి కత్తెరకు పని చెప్పాల్సి వచ్చింది. లం…డ, f…k, మ… ద్, ము…డ వంటి పదాలను తొలగించాలని సెన్సార్ బోర్డ్ ఫ్యామిలీ స్టార్ ను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీంతో చిత్ర బృందం వాటిని మ్యూట్ చేశారని సమాచారం. సెన్సార్ రిపోర్టు బయటకు వచ్చాక దాన్ని చూసిన నెటిజెన్లు ఫ్యామిలీ స్టార్ లో ఇన్ని బూతులు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవు. కానీ ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ కోరింది. దీంతో బాటిల్ లోగోలను సిజితో కవర్ చేశారు మేకర్స్.

- Advertisement -

ఫ్యామిలీ స్టార్ సెన్సార్ టాక్ ఇదే…

విజయ్ దేవరకొండ హీరోగా, డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన రెండవ సినిమా ఇది. గతంలోనే వీరిద్దరి కాంబోలో గీతగోవిందం అనే బ్లాక్ బస్టర్ మూవీ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో మరోసారి విజయ్, పరుశురాం అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా, దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో రష్మిక అతిధి పాత్రలో కనిపిస్తుందని వార్తలు వచ్చాయి.

ఇక ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి. తాజాగా సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఫ్యామిలీ స్టార్ ఆకట్టుకుంటుందని అంటున్నారు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ మూవీ పైనే పెట్టుకున్నాడు. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే, ఈసారి విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. హీరోయిన్ మృణాల్ కూడా ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్. మరోవైపు మృణాల్ కు ఈ మూవీ చాలా ముఖ్యం. ఫ్యామిలీ స్టార్ హిట్ అయితే ఆమె ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడుతుంది. మరి ఈ మూవీతోనైనా విజయ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా ? మృణాల్  ఠాకూర్ హ్యాట్రిక్ హిట్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని పదిల పరుచుకుంటుందా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు