Jr NTR : దేవరతో దాస్, టిల్లు… ఆ బిగ్ సర్ప్రైజ్ ఇదేనా?

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన టాలీవుడ్ లోని మరో ఇద్దరు యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ లతో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ ఇద్దరు హీరోలతో కలిసి తారక్ ఏం చేస్తున్నారు? దేవరతో కలిసి దాస్, టిల్లు ఇవ్వబోతున్న అ బిగ్ సర్ప్రైజ్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

ఆ బిగ్ సర్ప్రైజ్ ఇదేనా?

మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. అక్టోబర్ 10న దేవర థియేటర్లోకి రాబోతున్న విషయం తెలిసిందే. మరోవైపు మరోవైపు గామి మూవీతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్సేన్. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద టిల్లు హడావుడి నడుస్తోంది. టిల్లు స్క్వేర్ మూవీతో సిద్దు జొన్నలగడ్డ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అయితే తాజాగా ఈ ముగ్గురు హీరోలు కలిసి కనిపించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మార్చ్ 29న ప్రేక్షకులకు ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ భారీ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఈ క్రమంలోనే సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ లతో కలిసి ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ మూవీని వీక్షించారు. అదే సమయంలో ఎన్టీఆర్, విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ, నిర్మత నాగ వంశీ కలిసి దిగిన ఓ సెల్ఫీ బయటకు వచ్చింది. అయితే తారక్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సిద్దు బిగ్ సర్ప్రైజ్ రాబోతుందంటూ అభిమానులను సస్పెన్స్ లో పెట్టాడు. ఈ మూవీ సక్సెస్ మీట్ ఏప్రిల్ 8న గ్రాండ్ గా జరగబోతుందని, దానికి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నారని సమాచారం. సిద్దు చెప్పుకొచ్చిన ఆ బిగ్ సర్ప్రైజ్ ఇదేనని తెలుస్తోంది. ఇక టిల్లు స్క్వేర్ మూవీ అంచనాలను మించి దూసుకెళ్తోంది. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించగా, మల్లిక్ రాం దర్శకత్వం వహించారు. రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే టిల్లు స్క్వేర్ 85 కోట్ల కనెక్షన్లను సాధించడం విశేషం. త్వరలోనే ఈ మూవీ 100 కోట్లు కొల్లగొడుతుందని నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు.

తారక్ సినిమాల విషయానికొస్తే…

ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ( Jr NTR ) చేస్తున్న మొట్టమొదటి మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న దేవర మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు తారక్ “వార్ 2“తో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీలో తారక్ తో పాటు గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు