War 2 : డేంజర్ జోన్ లో “వార్ 2″… ఆ బోరింగ్ స్టోరీ మాకొద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్

War 2 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “దేవర” సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత తారక్ చేయబోతున్న డైరెక్ట్ ఫస్ట్ హిందీ మూవీ “వార్ 2” గురించి నందమూరి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. “వార్ 2” జానర్, ప్లాట్ గురించి సోషల్ మీడియాలో అప్పుడే చర్చ మొదలైపోయింది. ఆ బోరింగ్ స్టొరీ మాకొద్దు బాబోయ్ అంటూ సోషల్ మీడియా వేదికగా మేకర్స్‌కు మొరపెట్టుకుంటున్నారు.

“పఠాన్” సినిమా ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో స్పై యూనివర్స్ గురించి ప్రేక్షకులు ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారన్న విషయం మేకర్స్‌కు అర్థమైంది. ఈ మూవీ ఒకే భాషలో ఏకంగా 1000 కోట్లు సాధించిన మొదటి చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. పఠాన్ సక్సెస్ అవ్వడం వల్ల స్పై యూనివర్స్ లో తర్వాత వచ్చిన టైగర్ 3, వార్ 2 సినిమాలకు విపరీతమైన ను క్రేజ్ వచ్చింది. కానీ నవంబర్లో రిలీజ్ అయిన టైగర్ 3 మాత్రం ఆశించిన స్థాయి రిజల్ట్‌ను తీసుకురాలేకపోయింది. దీంతో ఈ స్పై యూనివర్స్‌లో వస్తున్న సినిమాలు అన్ని ఇలాంటి స్టోరీలో ఉంటాయనే ఆలోచన వచ్చింది. అంతే కాదు, ఆడియన్స్‌లో స్పై యూనివర్స్ పై టైగర్ 3 విరక్తి పుట్టేలా చేసింది.

ఇదే విషయం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను టెన్షన్ పడుతోంది. హృతిక్ రోషన్ తాజా చిత్రం “ఫైటర్” కూడా దాదాపుగా అదే ప్లాట్ తో వస్తోంది. భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించకపోవడం “వార్ 2” పై అనుమానాలను రేకెత్తిస్తోంది. “ఫైటర్” మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి చూస్తే స్పై యూనివర్స్ పై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోయిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

- Advertisement -

దీంతో ఇప్పుడు అందరి దృష్టి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించబోతున్న మల్టీస్టారర్ “వార్ 2″పై ఉంది. అయితే “టైగర్ 3” నిరాశపరచడంతో నిర్మాత ఆదిత్య చోప్రా అతని బృందంతో కలిసి ఆ సినిమాలో కనిపించిన లోపాలను తన నెక్స్ట్ మూవీ లో కనిపించకుండా జాగ్రత్త పడుతూ, స్క్రిప్టును మరింత ఎఫెక్టివ్ గా తయారు చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “వార్ 2” సడన్ గా ఇలా డేంజర్ జోన్ లో పడడంతో తారక్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.

భారత్, పాకిస్తాన్ మధ్య శత్రుత్వంతో వచ్చే సినిమాలు జనాలకు బోర్ కొడుతున్నాయని, హిందీ మేకర్స్ ఇంకెన్నాళ్లు ఇదే స్టోరీ లైన్ ను పట్టుకుని వేలాడతారని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి ఈ మూవీ చాలా కీలకం. ఎందుకంటే ఈ చిత్రం తారక్ ను హిందీ మాస్ ఆడియన్స్ కు చేరువ చేసే ఆయుధం లాంటిది. కాబట్టి ఏ విధంగానూ “వార్ 2” విషయంలో తప్పులు జరగకూడదు అని కోరుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు