Hbd Hrithik Roshan : పిచ్చెక్కించే కటౌట్… గ్రీక్ గాడ్ హృతిక్ కండల వెనకున్న రహస్యం ఈ డైట్ ప్లానే

Hbd Hrithik Roshan :  సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఫిట్ గా ఉండే హీరోల్లో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఒకరు. ఆయన ఫిట్నెస్ చూస్తే అబ్బాయిలకు అసూయ కలగడం ఖాయం. ఇక అమ్మాయిలు అయితే ఆ పిచ్చెక్కించే కటౌట్ కోసం పడి చస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సిక్స్ ప్యాక్ తో, కండలు తిరిగిన దేహంతో, అమ్మాయిలను ఇట్టే ఆకర్షించే ఈ గ్రీక్ గాడ్ కండల వెనకున్న సీక్రెట్ ఏంటో తెలిస్తే బాగుండు అనుకుంటున్నారా? హృతిక్ 50 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ 30 ఏళ్ల ఏజ్ ఉన్నట్టుగా కనిపించడానికి ముఖ్య కారణం ఆయన ఫాలో అయ్యే డైట్, అలాగే వ్యాయామాలు. మరి ఆ డైట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న హృతిక్ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలా కష్టపడతారు. ఇందుకోసం వ్యాయామం నుంచి డైటింగ్ వరకు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ప్రత్యేకమైన డైట్ ను కూడా ఫాలో అవుతారు. ఆయనకు ఫుడ్ అంటే చాలా ఇష్టమట. డైట్ లో ఉన్నప్పుడు 100 గ్రాముల మాంసం, బ్రోకలీ, మొలకలు, బచ్చలికూర, రైస్, పాస్తా తింటాడు. బ్రేక్ ఫాస్ట్ లో హృతిక్ నాలుగు గుడ్లు, రెండు బ్రౌన్ బ్రెడ్‌లు, ప్రోటీన్ షేక్, నట్స్, కార్న్ ఫ్లేక్స్‌తో కూడిన పాలు, పండ్లు తీసుకుంటాడు.

లంచ్‌లో రెండు రోటీలు, గ్రీన్ వెజిటెబుల్స్, చికెన్ బ్రెస్ట్, సలాడ్, ఫిష్ స్నాక్స్, ప్రొటీన్ షేక్, గుడ్డులోని తెల్లసొన ఉంటాయి. హృతిక్ డిన్నర్ విషయానికొస్తే… గుడ్లు, 1/2 చికెన్ లేదా బ్రౌన్ బ్రెడ్‌, చేపలు, కూరగాయలు, సలాడ్ తింటాడు. ఈ హీరో ప్రతి మూడు గంటలకు ఏదో ఒకటి తింటాడట. ఆయన ఆహారంలో అల్లం, పసుపు, వేడి నీరు వంటి రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు కూడా ఉంటాయి. హృతిక్ కు ఇష్టమైన పండ్లు, కూరగాయల విషయానికొస్తే… సీజనల్ పండ్లు, అరటిపండు, మామిడి, యాపిల్, పుచ్చకాయ, బత్తాయి అంటే ఇష్టమని హృతిక్ ఓ సందర్భంలో చెప్పాడు. సరైన ఆహారంతో పాటు మంచి వ్యాయామం కూడా ముఖ్యం.

- Advertisement -

హృతిక్ వర్కవుట్ రొటీన్ విషయానికొస్తే… హృతిక్ వారానికి ఏడు రోజులు కాకుండా నాలుగు నుంచి ఐదు రోజులు మాత్రమే వ్యాయామం చేస్తాడు. ఈ సమయంలో, హృతిక్ కార్డియో వ్యాయామాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతాడు. ఉదయం, సాయంత్రం రెండు వ్యాయామాలు చేస్తాడు. మొదటి రోజు హృతిక్ వెన్ను, ఛాతీ వ్యాయామాలు చేస్తాడు. మరుసటి రోజు కాళ్లకు సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తాడు. మూడవ రోజు విశ్రాంతి తీసుకుంటాడు. నాల్గవ రోజు హృతిక్ చేతులు, యాబ్స్ ఎక్స్సైజులు చేస్తారు. ఐదవ రోజు కేవలం భుజాల రిలేటెడ్ వ్యాయామాలు మాత్రమే చేస్తాడు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు