Ashika Ranganath: “నా సామి రంగ” బ్యూటీ అనుష్కను రీప్లేస్ చేస్తుందా?

Ashika Ranganath: ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అందంతోపాటు అభినయం ఉండి పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకున్న సౌత్ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది అనుష్క మాత్రమే. “దేవసేన”గా ఈ అమ్మడు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ దక్కించుకుంది. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో హల్చల్ చేస్తున్న కొత్త హీరోయిన్లతో పోలిస్తే అనుష్క వెనుకబడిపోయింది. సినిమాల స్పీడ్ ను బాగా తగ్గించి, అరకొర సినిమాలతో అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తోంది.

ఇటీవల అనుష్క నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” మూవీ రిలీజ్ అయి, మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత అనుష్క నెక్స్ట్ మూవీ గురించి ఎలాంటి సమాచారం లేదు. అసలు ఆమె సినిమా చేస్తుందా? అనేది కూడా అనుమానమే. ఈ నేపథ్యంలోనే అనుష్కను రీప్లేస్ చేసే హీరోయిన్ గురించి వెతుకుతున్న నెటిజన్లకు “నా సామి రంగ” మూవీ హీరోయిన్ కనిపించింది. మరి ఈ బ్యూటీ అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ ను రీప్లేస్ చేసి టాలీవుడ్ లో మరొక స్వీటీ అవుతుందా?

కింగ్ నాగార్జున నటించిన “నా సామి రంగ’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ పై అందరి దృష్టి పడింది. ఈ అమ్మడు చూడ్డానికి అనుష్కలా ఉంది అంటూ, స్వీటీతో ఆషిక రంగనాథ్ ను పోలుస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ఆషిక రంగనాథ్ దగ్గర ప్రస్తావించగా.. ఆశ్చర్యకరంగా ఆమె కూడా ఇదే విషయాన్ని ఒప్పుకుంది.

- Advertisement -

తన రూపాన్ని అనుష్కతో పోలుస్తారని తనకు ముందే తెలుసు అని, దాన్ని తాను ఒక పెద్ద కాంప్లిమెంట్ గా భావిస్తానని తెలివిగా అనుష్క అభిమానులను సైతం తన వైపు తిప్పుకునే ఆన్సర్ ఇచ్చింది. అంతేకాకుండా అనుష్క అద్భుతమైన నటి అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. గతంలో కళ్యాణ్ రామ్ తో కలిసి “అమిగోస్” అనే సినిమా చేసిన ఆషిక రంగనాథ్ కు మొదటి సినిమాతో నిరాశ ఎదురయింది. అయినప్పటికీ రెండవ మూవీ నాగార్జున లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని కల్పించింది.

ఇక ఈ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమపై తనకున్న అభిమానాన్ని వెల్లడిస్తూ గ్లామరస్ పాత్రలు, పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ రెండింటికి సమ ప్రాధాన్యతను ఇస్తాను అంటూ అన్ని రకాల పాత్రలు చేయడానికి తాను రెడీ అనే విషయంపై హింట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆషిక రంగనాథ్ చేతిలో మూడు కొత్త సినిమాలు ఉన్నాయి. “నా సామి రంగ” మూవీ హిట్ అయితే ఈ బ్యూటీ కెరీర్ టర్న్ అయ్యే అవకాశం ఉంది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి “నా సామి రంగ” మూవీ హిట్ అవడం ఈ భామకు చాలా ముఖ్యం. అందుకే ప్రస్తుతం ఈ బ్యూటీ ఆశలన్నీ ఈ మూవీ పైనే ఉన్నాయి. మరి అనుష్క ప్లేస్ ను ఈ బ్యూటీ రీప్లేస్ చేయగలదా అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూస్తేనే గాని తెలియదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు