Mahesh babu: “గుంటూరు కారం” బిజినెస్&బ్రేక్ ఈవెన్ టార్గెట్ డిటైల్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” రిలీజ్ కి అంతా సిద్ధమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిరించడం జరిగింది. ఇక తాజాగా గుంటూరు కారం థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ వచ్చేసాయి. ఒక్కసారి ఏరియా వారీగా ఈ లెక్కలను గమనిస్తే…

నైజాం : 42Cr
సీడెడ్ : 13.75Cr
ఉత్తరాంధ్ర : 14Cr
ఈస్ట్ గోదావరి : 8.6Cr
వెస్ట్ : 6.5Cr
గుంటూరు : 7.65Cr
కృష్ణ : 6.50Cr
నెల్లూరు : 4Cr
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 102.00CR బిజినెస్ జరగగా, కర్ణాటక ఇంకా రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 9 కోట్లు, ఓవర్సీస్ 20 కోట్లు జరిగింది. ఇక వరల్డ్ వైడ్ గా గుంటూరు కారం 132 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 133 కోట్ల కి పైగా షేర్ సాధించాలి.

ఇక గుంటూరు కారంతో మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. ఇంతకు ముందు సర్కారు వారి పాట కి 120 కోట్ల బిజినెస్ జరగ్గా, గుంటూరు కారం దాన్ని బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి. సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా, ఈ కాంబో కి రికార్డుల మోత మోగడం ఖాయం. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం గుంటూరు కారం మంచి టాక్ తెచ్చుకుంటే 150 కోట్లకి పైగా కలెక్షన్స్ వసూలు చేయొచ్చని టాక్.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు