GunturuKaaram Trailer Talk: ‘గురూజీ’ గురూజీ అంటే గుణపం దింపేలా ఉన్నాడే…

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ & హైలీ ఇంఫ్లేమబుల్ మూవీ “గుంటూరు కారం” మాస్ ట్రైలర్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితమే రాత్రి 9.09 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇక రిలీజ్ అయిన నెక్స్ట్ మినిట్ నుండే బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ట్రెండ్ చేయడం స్టార్ట్ చేసేసారు.

ఇక ట్రైలర్ చూడగానే ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సారి సంక్రాంతి పండక్కి రమణగాడి ఫ్యాన్స్ కి గుంటూరు కారం ఘాటు తో ఫుల్ మీల్స్ గ్యారెంటీ అని ట్రేడ్ విశ్లేషకులు అనుకున్నారు.. కానీ అది ట్రైలర్ చూసాక ఎన్నో ఆశలు పెట్టుకున్న త్రివిక్రమ్ అభిమానుల ఆశలపై నీళ్లు జల్లాడని అనిపిస్తుంది. మహేష్ కాంబో లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలతో హైప్ క్రియేట్ చేయగా, ఈ ట్రైలర్ చూసాక ఆ హైప్ కాస్తా తగ్గినట్టయింది.

అసలు కథ విషయానికి ఏమి కొత్త కథ అనిపించలేదు. నిజానికి త్రివిక్రమ్ సినిమాల్లో కొత్త కథలు పెద్దగా ఉండవు. ఆ మాటకొస్తే త్రివిక్రమ్ తన ప్రతి కథని ఏదో ఒక పాత రచయితల పుస్తకాల నుండి కాపీ కొడతాడని టాక్ ఉంది. అప్పట్లో వచ్చిన “అఆ” సినిమా స్టోరీని యుద్ధన పూడి సులోచనారాణి రచించిన “మీనా” నవల నుండి కాపీ కొట్టగా, ఇప్పుడు గుంటూరు కారం ని “కీర్తి కిరీటాలు” నవల నుండి కాపీ కొట్టినట్టు ఉంది.

- Advertisement -

ట్రైలర్ లో సింపుల్ గా కథ ఎలా ఉందంటే, రాయల సీమ కి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నేత వైరా వెంకట స్వామి ఫ్యామిలికి చెందిన “రమణ” ఇంటి నుండి దూరంగా ఉంటూ తాను జాలీగా తనకెవరూ లేనట్లు తన బతుకు బతుకుతుంటాడు. అయితే అనుకోని కారణాల వల్ల, ఊళ్ళో ఉండే వాళ్ళ కోసం తన ఫ్యామిలి కి చెందిన పార్టీ వాళ్ళ తోనే గొడవకి దిగుతాడు రమణ. ఆ క్రమంలో ఎదురైన సమస్యలేంటి? రమణ గాడి ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి వెంకట స్వామి ఏం చేసాడు. మధ్యలో తన తల్లికి రమణ ఎందుకు దూరమయ్యాడు? అనేది ట్రైలర్ లో చూపించాడు.

చూడ్డానికి చాలా రొటీన్ గా ఉన్న ఈ ట్రైలర్ లో త్రివిక్రమ్ మార్క్ మొత్తం మిస్ అయ్యిందని చెప్పాలి. ఇక కొంతమంది నెటిజన్లయితే ‘అజ్ఞాత వాసి’ రోజులు గుర్తొస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పైగా మహేష్ లో మిస్ అయిన న్యాచురల్ కామెడీ ని త్రివిక్రమ్ ఈ సినిమాతోనైనా చూపిస్తాడని అనుకున్నారు. కనీసం ఖలేజాలో సగం కూడా లేనట్లు అనిపిస్తుంది ఈ ట్రైలర్.

ఇక తమన్ బీజీఎమ్ కూడా ఏదో పెట్టిన డబ్బుకి ఇచ్చిందే ఎక్కువా అన్నట్టు.. యావరేజ్ గా ఇచ్చాడు. మరో పెద్ద విషయమేంటంటే ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి ఇద్దరు హీరోయిన్లు ఉన్నా వాళ్ళకి పాటలకే పరిమితం చేసారని అనిపించేలా చేసారు. ట్రైలర్ కి ఇంత టైం తీసుకుంది ఇందుకా అని ఫ్యాన్స్ ఫీలయ్యేలా చేసాడు. అయితే అలవైకుంటపురంలో ట్రైలర్ వచ్చినపుడు కూడా ఫ్యాన్స్ ఇలాగే అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత లెక్కలన్నీ సెట్ చేసాడు గురూజీ. మరి అలాంటి మ్యాజిక్ ఏమైనా థియేటర్లో చేస్తే బాగుంటుందన్న ఒక్క హోప్ తప్ప ఇంకే మాటలు ఇప్పుడు రావడం లేదు. మరి థియేటర్లోనే చూసుకుందాం ఇక..

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు