Rashi khanna: మనోళ్లు పట్టించుకోవట్లేదని కోలీవుడ్ చెక్కేసింది?

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. ఢిల్లీ కి చెందిన ఈ అమ్మాయి మనం లో ఓ చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత ఊహలు గుసగుసలాడే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడమే గాకుండా, మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. పైగా తెలుగు చక్కగా మాట్లాడే అతి తక్కువ మంది హీరోయిన్లలో ఈ భామ ఒకరు. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి పొజిషన్ కి వెళ్లాల్సిన ఈ భామ, మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాల సెలెక్షన్స్ లో ఫెయిల్ అయ్యి, ఆ తరువాత పూర్తిగా కనుమరుగైంది.

ఎప్పుడో అయిదేళ్ల కిందట వచ్చిన ప్రతిరోజు పండగే సినిమా తరువాత మరి సక్సెస్ లేని ఈ భామ, తనకున్న టాలెంట్ వల్ల మొన్నటి వరకు ఆఫర్లు అందుకుంది. అయితే ఆ టాలెంట్ ని మంచి కథాబలం ఉన్న సినిమాలు ఎంచుకోవడం లో విఫలం అయింది. ఇక లాస్ట్ ఈ అమ్మాయి చేసిన సినిమాలన్నీ కూడా ప్లాప్. చివరగా, పక్కా కమెర్షియల్ లో హీరోయిన్ గా నటించిన ఈమె, థ్యాంక్ యు లో సైడ్ హీరోయిన్ గా నటిచింది. ఆ సినిమాలు డిజాస్టర్లు అవడంతో మళ్ళీ టాలీవుడ్ లోఛాన్సులు రాలేదు.

ఈ క్రమంలో కోలీవుడ్ లో సినిమాలు చేయడం అక్కడ సర్దార్ లాంటి హిట్లు పాడడం వల్ల కోలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకోవడమే గాక, దాదాపు మకాం అక్కడికి మార్చేసిందని చెప్పాలి. ఇక రాశి ఖన్నా టాలీవుడ్ లో సినిమాలు చేసి రెండేళ్ల పైనే అయింది. మరి మళ్ళీ ఈ టాలెంటెడ్ బ్యూటీ టాలీవుడ్ కి వస్తుందా రాదా అని రాశి ఖన్నా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాశి ఖన్నా మళ్ళీ మంచి స్క్రిప్ట్ దొరికితే తెలుగులో ఖచ్చితంగా చేస్తానని చెప్పింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు