Gunturu kaaram: ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా.. మరి కొత్త డేట్ మాటేంటో?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే. మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ చేసిన సినిమా కావడంతో ఈ కాంబో పై ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ దగ్గరినుండి, పాటల దాకా, టీజర్ తో సహా అన్ని సినిమాపై హైప్ ఎక్కించగా, సినిమా ట్రైలర్ కోసం కూడా ఫ్యాన్స్ పిచ్చిగా వెయిట్ చేసేలా చేస్తుంది. అయితే రిలీజ్ డేట్ కి కొన్ని రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిద్దామని మేకర్స్ ప్లాన్ చేసారు.

అన్ని కుదిరితేహైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జనవరి 6న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిద్దామని మేకర్స్ ప్లాన్ చేయడం జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ లభించలేదు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసారు. అయితే కొత్త రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

అయితే తాజాగా వచ్చిన సమాచారం గుంటూరు కారం ఈవెంట్ వేదికగా ఖైత్లాపూర్ కూకట్ పల్లి గ్రౌండ్స్ లో నిర్వహించే అవకాశం ఉంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 8న లేదా 9న జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్ అయ్యిన తరువాతే అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు