Suneel: ఇలాంటివి మళ్ళీ అవసరమా భయ్యా..!

టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి, హీరో అయ్యి, ఇప్పుడు విలన్ గానూ అద్భుతంగా రాణిస్తున్న సునీల్ గురించి ప్రత్యేకంగా ఆడియన్స్ కి చెప్పనక్కర్లేదు. ఎలాంటి రోల్ ఇచ్చినా ఆ పాత్రకు న్యాయం చేయగల సమర్థుడని ఆయన నిరూపించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం అన్న తేడా లేకుండా అన్ని భాషల్లోనూ సినిమా చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక రేపో మాపో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్న సునీల్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ అయిన గేమ్ ఛేంజర్, పుష్ప 2లతో పాటు ఇంకా అరడజనుకి పైగా సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

అయితే తాజాగా సునీల్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది?’ అనే సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడంటూ ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. ‘కిల్లర్ నాని’ అనే పాత్రలో నటిస్తున్న సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవగా, ఆ లుక్ లో చాలా ఎబెట్టుగా లావుగా కనిపించాడు. చూస్తుంటే సునీల్ అందులో నెగిటివ్ రోల్ చేస్తున్నాడని అనిపిస్తూ ఉన్నా, మేకర్స్ ఆ పాత్రని కామెడీగా చూపిస్తున్నారని తెలుస్తుంది.

అయితే విలన్ గా మంగళం శీను లాంటి పవర్ ఫుల్ పాత్రలు దొరుకుతున్నపుడు ఇలాంటి నాసిరకం, చిల్లర పాత్రలు అవసరమా అని సునీల్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా జైలర్ లో అలాంటి రోల్ చేసిన సునీల్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఎందుకంటే సినిమాలో ఆ పాత్ర తీసేసినా పెద్ద తేడా ఏమి ఉండదు. అయితే నటుడుగా మంచి ఫామ్ లో ఉన్న సునీల్ కి ఇలాంటి సి గ్రేడ్ రోల్స్ చేయడం తన కెరీర్ ని డీలా పడేసే ప్రమాదం ఉందని ట్రేడ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంపై సునీల్ ఎప్పుడు రియలైజ్ అవుతాడో..

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు