Ayalaan Trailer Talk : పాత కథే.. ట్రీట్ మెంట్ కొత్తగా..

కోలీవుడ్ లో ఈ పొంగల్ కి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘అయలాన్’ కూడా ఒకటి. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా మొదలై చాలా కాలం అవుతున్నా, అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఫైనల్ గా సంక్రాంతి కి వస్తుంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఇంతకు ముందు టీజర్ రిలీజ్ అయినప్పుడే స్టోరీ లైన్ ని మొత్తం చెప్పిన మేకర్స్, ఇప్పుడు దాన్నే ల్యాండ్ స్కేప్ లో ఇంకాస్త డిటైలింగ్ గా రిలీజ్ చేసినట్టుంది ట్రైలర్.

భూమ్మీద అన్ని జీవరాసుల్ని ప్రేమిస్తూ సమానంగా చూసే హీరో దగ్గరికి ఒక సహాయం కోసం భూమి మీదకి వచ్చిన ‘ఏలియన్’ కింద ఉంది చేసిన పనులేంటి? ఆ ఏలియన్ భూమ్మీదికి రావడానికి గల కారణం ఏంటి? దానికి హీరో ఏ విధంగా సహాయ పడ్డాడు అనేది కథ. ఇంతకు ముందు ఈ కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాల్లో ఏలియన్స్ ని నెగిటివ్ గా చూపిస్తే, మరికొన్ని సినిమాల్లో పాజిటివ్ గా చూపించారు. ఇక ఇండియన్ మూవీస్ లో కూడా ‘కోయి మిల్ గయా’ లాంటి సినిమా కూడా అయలాన్ తరహా కాన్సెప్ట్ తోనే వచ్చింది.

అయితే ఇప్పుడు వస్తున్న అయలాన్ కూడా అదే కాన్సెప్ట్ తో వస్తున్నప్పటికీ శివ కార్తికేయన్ స్టైల్ లో కామెడీ జోనర్ లో, సరికొత్త ట్రీట్ మెంట్ లో ఈ సినిమాని అందిస్తున్నారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్ బాగున్నాయి. అయితే ఆ ఏలియన్ ని ఇంకాస్త రియాల్సిటిక్ గా చూపించాల్సింది. ట్రైలర్ కాన్సెప్ట్, ఇంకా కట్ చేసిన విధానం బాగుండగా, ట్రైలర్ లోనే స్టోరీ లైన్ చెప్పేయడంతో సినిమాని స్క్రీన్ ప్లే బలంతో డైరెక్టర్ ఎలా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసాడన్నది తెలియాలి.

- Advertisement -

ఇక అయలాన్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, శరత్ కేల్హర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరణ్, డేవిడ్ బ్రౌటన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. R. రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించాడు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు