Hanuman: హనుమాన్ ధైర్యానికి.. ప్లస్ – మైనస్ లివే..!

హనుమాన్.. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రముఖ హీరోయిన్ అమృత అయ్యర్ కాంబోలో వస్తున్న చిత్రం హనుమాన్.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ్ , కన్నడ,మలయాళం, స్పానిష్, కొరియన్, ఇంగ్లీష్, చైనీస్, జపనీస్ తో సహా 17 భాషలలో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పై ఇప్పుడు అందరి అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి కొన్ని విషయాలు కీలకంగా మారుతున్నాయి.

ముఖ్యంగా హనుమాన్ ధైర్యానికి ప్లస్ – మైనస్ లు ఏంటి అనే విషయానికి వస్తే.. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా సక్సెస్ కి ప్లస్ పాయింట్స్ ఏంటంటే.. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రజలు అదే మూడ్ లో ఉండడంతో ఇప్పుడు హనుమాన్ చిత్రంపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో మరొకవైపు అయోధ్య రామ మందిరం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చేటట్టు కనిపిస్తోంది. ఇకపోతే గతంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రాలు కూడా మంచి విజయం సాధించడంతో అందరి చూపు ఈ సినిమా పైనే పడింది. పైగా ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇన్ని భాషలలో విడుదల కాలేదు. ఇప్పుడు ఈ సినిమా విడుదల అవడం.. పైగా సూపర్ హీరో కాన్సెప్ట్ తో రావడంతో.. పెద్దలే కాదు పిల్లలు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరి ఈ సినిమాకి మైనస్ ఏంటి అనే విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం సినిమాను అదే రోజున విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అంత పెద్ద స్టార్ హీరో సినిమాకు పోటీగా ఈ సినిమా విడుదల కాబోతోంది. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతోంది అంటే ప్రేక్షకులు అందరూ కూడా ఆ హీరో సినిమాకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అలాంటిది ఏకంగా మహేష్ బాబు సినిమా విడుదలవుతోంది అంటే, ఇక మహేష్ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఆ సినిమాపైనే ముందు మొగ్గు చూపిస్తారు. పైగా మాటల మాంత్రికుడు దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో కామన్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాకి పోటీగా హనుమాన్ విడుదల అయితే ఆ దాడికి తట్టుకుంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమా జనవరి 12వ తేదీన మహేష్ మూవీకి పోటీగా నిలిచి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు