Venkatesh: సైంధవ్ మూవీకి ప్లస్ – మైనస్ లివే?

ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రం గా సైంధవ్ ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన చాలా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో మరింత దూకుడు పెంచింది చిత్ర బృందం.. ఇందులో భాగంగా ట్రైలర్ ను విడుదల చేయగా.. అయితే అందులో పాప డాన్స్ చేస్తూ తన తండ్రిని అనుకరిస్తూ.. చాలా ప్లజెంట్ గా ట్రైలర్ ప్రారంభమైంది. ఓపెనింగ్ సీక్వెన్స్ లో తండ్రి కూతుర్ల బంధాన్ని అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేస్తూ.. తండ్రికి తన కూతురే సర్వస్వం.. కూతురికి తన తండ్రి సూపర్ హీరో అన్న రేంజ్ లో సినిమాని తెరకెక్కించారు.

ఇకపోతే ఈ సినిమా కథ విషయానికి వస్తే.. దురదృష్టవశాత్తు పాపకి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. అయితే వ్యాధి నయం చేయాలంటే ఇంజక్షన్ ద్వారా అక్షరాల రూ .17 కోట్లు స్నేహితులను ప్రత్యర్థులను తిరిగి కలవాలని నిర్ణయించుకుంటాడు.. ఆయన గతం ఏమిటి ? ఏం జరిగింది? అనే విషయాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇకపోతే తన కుమార్తె కోసం శాంతి మార్గంలో నడవాలని ఎంచుకున్న తండ్రి.. ఆమె కోసం హింసాత్మకంగా మారితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని సస్పెన్స్ లో పెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యాక్షన్ , థ్రిల్లర్ సినిమా ప్రేమికులకు నచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమాకు ఇదే ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా సాధారణ , మధ్య తరగతి తండ్రిగా కనిపించడం ఆయన నటన సినిమాకి మరింత ప్లస్ అవుతున్నాయి.

ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు పిల్లలు కూడా వచ్చి ఈ సినిమాని వీక్షిస్తారనటంలో సందేహం లేదు. అయితే 13వ తేదీ విడుదలవుతున్న నేపథ్యంలో సంక్రాంతి హాలిడేస్ కూడా ఒక్కరోజే మిగిలి ఉండడం.. పైగా తెలుగులో స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి నాలుగు చిత్రాలు విడుదలవుతూ ఉండడం.. వీటికి తోడు డబ్బింగ్ చిత్రాలు కూడా వస్తున్నాయి.. పైగా థియేటర్ల కొరత ఏర్పడింది.. ఇలాంటి సమయంలో ఏ సినిమాని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకి కొంచెం మైనస్ అనిపిస్తోంది అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అడ్డంకులను ఎదుర్కొని ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు