Turbo: తగ్గేదేలేదంటున్న సునీల్! అన్నింట్లో పాతుకుపోతున్నాడు…

టాలీవుడ్ లో బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ కామెడీ చేయగల కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే ఒకప్పుడు అందరూ చెప్పే పేరు సునీల్.. అయితే మర్యాద రామన్న తరవాత హీరోగానే సినిమాలు చేయడంతో బ్రహ్మీ ప్లేస్ ని వెన్నెల కిషోర్ రీప్లేస్ చేసాడు. అయితే సునీల్ రేంజ్ కమెడియన్ మాత్రం మళ్ళీ రాలేదు. అయితే హీరోగా అంతగా గుర్తింపు తెచ్చుకోలేని సునీల్ మళ్ళీ కలర్ ఫోటో లాంటి సినిమాతో విలన్ గా కెరీర్ ని ఆరంభించాడు.

డిస్కో రాజా లోనే విలన్ గా నటించినా ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇక కలర్ ఫోటో బ్లాక్ బస్టర్ అయినా అది ఓటిటి లోనే.. కానీ సునీల్ ని విలన్ గా ఓ రేంజ్ లో నిలబెట్టిన పాత్ర పుష్ప సినిమాలో “మంగళం శీను” రోల్. పుష్ప లో అల్లు అర్జున్, ఫహద్ ఫజిల్ తర్వాత ఆ స్థాయిలో ఎలివేట్ అయిన పాత్ర ఇది. అందుకే ఈ సినిమా తరువాత సునీల్ కి వరుస ఆఫర్లు చుట్టు ముట్టాయి.

ముఖ్యంగా ఇతర ఇండస్ట్రీల్లోనూ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే తమిళ్ లో పాగా వేసేశాడు సునీల్. ఈ ఇయర్ లో తమిళ్ లో పెద్ద సినిమాలైన జైలర్, మార్క్ ఆంటోనీ, మహా వీరుడు, లేటెస్ట్ గా జపాన్ లో కూడా కీలక పాత్రల్లో నటించాడు సునీల్. తాజాగా సునీల్ మలయాళ ఇండస్ట్రీకి లో కూడా తన హవా చూపడానికి రెడీ అయ్యాడు.

- Advertisement -

తాజాగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న “టర్బో” అనే కొత్త సినిమా లో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక త్వరలోనే కన్నడ ఇండస్ట్రీ లో కూడా సినిమా చేయబోతున్నట్టు సునీల్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. ఇక మిగిలిన పెద్ద ఇండస్ట్రీ బాలీవుడ్డే. అక్కడ కూడా పాగా వేసేస్తే సునీల్ కి ఆల్ రౌండర్ గా ఇక తిరుగులేదు అని చెప్పాలి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు