Ooru Peru Bhairavakona: చిన్న సినిమా పీకకు చుట్టుకున్న సంక్రాంతి సినిమాల గొడవ

ఉరుము ఉరిమి మంగళం మీద పడింది అన్నట్టుగా సంక్రాంతి సినిమాల మధ్య నెలకొన్న గొడవ అటు తిరిగి ఇట తిరిగి చిన్న సినిమా పీకకు చుట్టుకుంది. “ఈగల్” మూవీ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంతో ముందుగా మాట ఇచ్చినట్టుగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఫిబ్రవరి 9ని సోలో రిలీజ్ డేట్ గా ఇచ్చేశారు. దీంతో ఆ ఎఫెక్ట్ అప్పటికే ఫిబ్రవరి 9 మా రిలీజ్ డేట్ అంటూ కర్చిప్ వేసి కూర్చున్న రెండు చిన్న సినిమాలపై పడింది. ఈ నిర్ణయం వల్ల ఆ రెండు సినిమాలు ఫిబ్రవరి 9 నుంచి తప్పుకోక తప్పలేదు.

ముందుగా దిల్ రాజు నిర్ణయంతో హీరో సిద్దు జొన్నలగడ్డ నెత్తి మీద పిడుగు పడ్డట్టుగా అయింది. గత ఏడాది నుంచి సిద్దు హీరోగా నటిస్తున్న “టిల్లు స్క్వేర్” మూవీ ఏదో ఒక రీజన్ తో పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఎట్టకేలకు ఫిబ్రవరి 9న రిలీజ్ చేద్దామని అనుకున్న మేకర్స్ కు ఫిలిం చాంబర్ తాజా నిర్ణయం షాక్ ఇచ్చింది. దీంతో ఈ సినిమా పోస్ట్ పోన్ కాక తప్పలేదు. ఇక ఎఫెక్ట్ పడిన మరో మూవీ “ఊరు పేరు భైరవకోన”. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ విలేజ్ హారర్ థ్రిల్లర్ కూడా ఫిబ్రవరి 9 న విడుదల కావాల్సి ఉంది. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై మంచి బజ్ ఉంది. “ఊరు పేరు భైరవకోన” మూవీని రాజేష్ దండ నిర్మించగా ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రోమో, పాట అన్ని వర్గాల సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా “నిజమే నే చెబుతున్న” పాట బాగా పాపులర్ అయ్యింది. విరూపాక్ష తర్వాత దాదాపుగా అలాంటి కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ పైనే హీరో సందీప్ కిషన్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇప్పటికే విఎఫ్ఎక్స్ సమస్యలు, ఇతర కారణాలతో ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అయిపోయిందని, రిలీజ్ అయిన విషయం కూడా ఎవరికీ తెలీదు అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

ఇక “ఊరు పేరు భైరవకోన” మూవీపై మళ్ళీ హైప్ ని క్రియేట్ చేయడానికి మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అనూహ్యంగా “ఈగల్” తాము అనుకున్న రిలీజ్ డేట్ ఫిబ్రవరి 9 మీద వచ్చి వాలడంతో మారడంతో ఎటూ తోచక కక్కలేని మింగలేని పరిస్థితిలో ఉన్నారు మేకర్స్. ఇప్పుడు తమ సినిమాకు తగ్గ రిలీజ్ డేట్ ను వెతుక్కునే పనిలో పడ్డారు. మరి కొత్త రిలీజ్ డేట్ ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు