Kalki 2898AD : రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైన్ లో పెట్టిన అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో Kalki 2898AD కూడా ఒకటి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులు ఇది చాలు డార్లింగ్ అంటూ సంబరపడిపోతున్నారు. ఇంతకీ Kalki 2898AD మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అంటే…

రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ Kalki 2898AD. “మహానటి” ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీనీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని వంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే Kalki 2898AD మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసింది. రాక్షసుడు కలి పాపాలు ఎక్కువైనప్పుడు అతన్ని అంతం చేయడానికి కల్కి వస్తాడు అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందుతోంది. Kalki 2898AD గ్లింప్స్ లో ప్రజలను కాపాడే కల్కిగా ప్రభాస్ గెటప్ అదిరిపోయింది. విష్ణువు చివరి అవతారం కల్కిగా ప్రభాస్ ఈ మూవీలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా Kalki 2898AD మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది.

తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం Kalki 2898AD మూవీ 2024 మే 9న రిలీజ్ కాబోతుందని అంటున్నారు. నిజానికి ముందుగా “కల్కి” మూవీని 2024 జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు స్వయంగా ప్రొడ్యూసర్ అశ్విని దత్ మే 9న ఈ మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. దానికి ఒక ప్రత్యేకమైన కారణమే ఉంది. వైజయంతి బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి, ఒకప్పటి బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సినిమాలు అదే తేదీన రిలీజ్ అయ్యి, సినిమా చరిత్రలో ప్రత్యేకమైన మూవీస్ గా నిలిచాయి. ఈ సెంటిమెంట్ తో పాటు మే 9న గురువారం కావడంతో వీకెండ్, అప్పట్లోపు సమ్మర్ సెలవులు కూడా కలసి వస్తాయి అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అని తెలియాలంటే Kalki 2898AD టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ అండ్ సి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు