HBD Hrithik Roshan : హృతిక్ ను “గ్రీక్ గాడ్” అని ఎందుకు అంటారో తెలుసా?

HBD Hrithik Roshan : హృతిక్ రోషన్… ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఈ హీరోకు అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హృతిక్ కు హీరోగా మొదటి చిత్రం “కహో నా ప్యార్ హై”తో ఓవర్ నైట్ స్టార్ డం సంపాదించుకున్నాడు. పైగా ప్రపంచంలోని టాప్ 10 అందగాళ్లలో ఒకడిగా అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. అమ్మాయిల కలలు రాకుమారుడైన హృతిక్ నేటితో 50 ఏళ్ళలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ హృతిక్ ను “గ్రీక్ వీరుడు” అని ఎందుకు పిలుస్తారు అనే ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం.

1974 జనవరి 10న జన్మించిన హృతిక్ రోషన్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుని 50 ఏళ్ళలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ హీరో స్టైలిష్ లుక్స్, యాక్టింగ్, డ్యాన్స్ చూసి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా పిచ్చెక్కిపోతారు. అందుకే ఆయనకు కేవలం ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో అభిమానులు ఉన్నారు. కహో నా ప్యార్ హై, ఆప్ ముజే అచే లగ్నే లగే, క్రిష్ నుండి ధూమ్ 2 వరకు, ఆపై జోధా అక్బర్, సూపర్ 30, వార్ ఇలా ఆయన నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. హృతిక్ హీరో అంటే భారీ బడ్జెట్ తో పాటు హిట్ ఖాయమని నమ్ముతారు బాలీవుడ్ నిర్మాతలు. ఇక తన అద్భుతమైన స్కిల్స్ తో భారీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరోను అందరూ ముద్దుగా “గ్రీక్ గాడ్” అంటూ ఉంటారు. దానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది.

ఇండియాలో ఇప్పటిదాకా ఒక్క హీరోకు కూడా దక్కని ఇలాంటి అరుదైన గౌరవం హృతిక్ కు మాత్రమే ఎందుకు దక్కింది అంటే… హృతిక్ రోషన్ ఒక్కసారి కాదు చాలా సార్లు వరల్డ్స్ మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ టైటిల్ గెలుచుకున్నాడు. దీనిబట్టి ఆయన ఎంత హ్యాండ్సమ్ అన్న విషయం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత హ్యాండ్సమ్ హీరోకు “గ్రీక్ గాడ్” అనే పేరు ఎందుకు వచ్చింది అంటే… హృతిక్ శరీర దారుఢ్యం, ఆయన ముఖ కవళికలు, అలాగే కళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఏ ప్రపంచంలో అందమైన అబ్బాయిలు గ్రీకు వారు.

- Advertisement -

వాళ్లకు తగినట్టుగా హృతిక్ లో పోలికలు ఉండడంతో పాటు ఆయన కళ్ళు సహజంగానే గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇది కూడా అత్యంత అరుదైన విషయం. ఈయనతో ఉన్న ప్రత్యేకతలు ముఖ కవళికలు, కళ్ళు గ్రీక్ దేవుడికి దగ్గరగా ఉంటాయట. అందుకే హృతిక్ రోషన్ ను గ్రీక్ గాడ్ అంటారన్న మాట. తన కఠోర శ్రమతో, అంకితభావంతో కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కు ఫిల్మీ ఫై తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు