90’s: 90’s వెబ్ సిరీస్‌లో నటించిన చిన్నారుల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

90’s:  90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సీరీస్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సీరీస్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ లో వచ్చిన ఈ సీరీస్ లో శివాజీ, వాసుకి ముఖ్య పాత్రల్లో నటించగా.. వీరితోపాటు వీరికి ముగ్గురు పిల్లలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్టులు కూడా మంచి పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ సిరీస్ ని చూడాలంటూ ప్రారంభంలోనే ఒక వాయిస్ తో దర్శకుడు చెప్పగా నిజంగానే చాలామంది 90’s కిడ్స్ ఈ సిరీస్ కి బాగా కనెక్ట్ అవుతున్నారని చెప్పవచ్చు. డైరెక్టర్ కచ్చితంగా ఏదైతే చెప్పాలనుకున్నారో చాలా క్లారిటీగా చెప్పారు.. పైగా ఈ సీరీస్ కి మంచి పేరు కూడా లభిస్తోంది.

దీనికి తోడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీకి మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇకపోతే చాలా రోజులుగా సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్న వాసుకి కూడా మంచి అవకాశం దక్కించుకుంది. ఇకపోతే ఒక కుటుంబానికి సంబంధించిన కథ కాబట్టి ఇందులో తల్లిదండ్రులుగా శివాజీ, వాసుకి చాలా అద్భుతంగా నటించారు. వారితో పాటు వారి పిల్లలుగా నటించిన ముగ్గురు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఇకపోతే అందరూ కూడా ఈ పిల్లల బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు.

మరి వీరి బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే పెద్ద కుమారుడిగా నటించిన మౌళి తనూజ ప్రశాంత్ ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రిటీగా పేరు సొంతం చేసుకున్నారు. ఇతడికి 4 లక్షలకు పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మౌళి టాక్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. హాస్టల్ డేస్ అనే ఒక సీరీస్ లో కూడా నటించారు. ఇక తర్వాత కూతురు దివ్య పాత్రలో నటించింది వాసంతిక . ఈమె సలార్ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.అయితే సలార్ సినిమాతో పెద్దగా గుర్తింపు రాకపోయినా ఈ సీరీస్ తో భారీగా పాపులారిటీ దక్కించుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా భవిష్యత్తులో మంచి నటి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

- Advertisement -

చిన్నపిల్లాడి గా నటించిన ఆదిత్య పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇతడి పేరు రోహన్.. సీరియల్స్ లో ఇంతకుముందు కూడా నటించారు. ఇప్పుడు ఈ సిరీస్ తో బిజీ అవడంతో సినిమాలలో అవకాశాలు భారీగా వస్తున్నాయని సమాచారం. ముఖ్యంగా ఇతడి కామిడీ టైమింగ్ కి సినీ సెలబ్రిటీలు కూడా ముచ్చట పడుతున్నారు.ఇకనైనా రోహన్ కి భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు